నన్నే కాటు వేస్తావా.. పామును తాత ఏం చేశాడంటే? వీడియో

Updated on: Sep 15, 2025 | 3:23 PM

పాము పేరు వింటేనే చాలా మంది భయంతో వణికిపోతారు. పాము కనిపిస్తే చాలా దూరం పారిపోతారు...కానీ కొంత మందికి భయం ఉండదు. అలాంటి ఓ వ్యక్తి ఏకంగా పామును పట్టుకుని మెడలో వేసుకున్నాడు. అంతేకాదు, మెడలో పాముతో గ్రామం అంతా తిరిగాడు. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అంబేద్కర్‌ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కమిని పంచాయతీ పరిధిలోని పొట్టితిప్పలో ఈ ఘటన జరిగింది.

మద్యం మత్తులో ఉన్న గొల్లపల్లి కొండ అనే వ్యక్తి.. నాగుపాముతో చెలగాటం ఆడి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి, తన కోళ్ల గూడులోకి గుడ్డు కోసం వచ్చిన పామును గుర్తించాడు. ఆ పాము అతన్ని ఒకసారి కాటేసినప్పటికీ ఆస్పత్రికి వెళ్లకుండా, దానిని పట్టుకుని నన్నే కాటేస్తావా అంటూ.. పామును మెడలో వేసుకుని గ్రామంలో హల్ చల్ చేశాడు. భయ భ్రాంతులకు గురైన స్థానికులు పామును వదిలెయ్యమని కొండను హెచ్చరించారు. కానీ, అతను పామును స్థానికుల వైపు విసరుతూ భయపెట్టాడు. ఈ క్రమంలో ఆ పాము రెండో సారి కూడా కొండను కాటేసింది. ఇదంతా స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. పాము అతన్ని రెండవసారి కాటువేసిన తర్వాత, స్థానికులు జోక్యం చేసుకుని పామును చంపి, కొండను వెంటనే ముమ్మిడివరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆ పాము విషం మరీ ప్రమాదకరమైనది కాకపోవడంతో రెండు సార్లు కాటు వేసినా కొండా ప్రాణాలు పోకుండా బయటపడ్డాడు. ముమ్మిడివరం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించారు. గొల్లపల్లి కొండ మద్యం మత్తులో స్థానికులను బెదిరించినందుకు కేసు నమోదు చేశారు.

మరిన్ని వీడియోల కోసం :

అద్భుత దృశ్యం.. ఆకాశానికి తాకుతున్న సముద్రం వీడియో

దసరా నవరాత్రులు ఈసారి 9 కాదు.. 10 రోజులు.. ఎందుకో తెలుసా?వీడియో

ఎంత గొప్ప మనస్సు..సొంత ఇంటిని పాఠశాలగా మార్చిన లారెన్స్‌ వీడియో

ఆపరేషన్‌ మధ్యలో వదిలేసి ఇదేం పాడుపని డాక్టరూ వీడియో