మద్యం మత్తులో అన్నదమ్ముల మధ్య గొడవ.. చివరికి
అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం కండ్రిగలో దారుణం జరిగింది. మద్యం మత్తులో అన్నదమ్ములు సాదిక్, రఫీక్‌లు గొడవపడ్డారు. ఈ క్రమంలో తమ్ముడు రఫీక్, అన్న సాదిక్‌ను కత్తితో పొడిచి చంపాడు. తల్లిదండ్రులు చనిపోవడంతో ఇంటిని వదిలి వెళ్లాలనే వివాదం ఘర్షణకు దారితీసినట్లు స్థానికులు చెబుతున్నారు.
అన్నమయ్య జిల్లాలో జరిగిన ఒక దారుణ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. గుర్రంకొండ మండలం కండ్రిగలో మద్యం మత్తులో అన్నదమ్ముల మధ్య జరిగిన గొడవ హత్యకు దారితీసింది. సాదిక్, రఫీక్ అనే అన్నదమ్ములు మద్యం సేవించి వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో తమ్ముడు రఫీక్ ఆగ్రహంతో తన అన్న సాదిక్‌ను కత్తితో దారుణంగా పొడిచి చంపాడు. స్థానికుల కథనం ప్రకారం, అన్న సాదిక్ లారీ క్లీనర్‌గా పనిచేస్తుండగా, తమ్ముడు రఫీక్ ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. వారి తల్లిదండ్రులు మరణించిన తర్వాత, ఇంటిని వదిలి వెళ్ళాలని తరచుగా సాదిక్ తన తమ్ముడు రఫీక్‌తో గొడవ పడేవాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రయాణికులకు అలెర్ట్.. రైల్వే ఛార్జీల్లో భారీ మార్పులు.. తప్పక తెలుసుకోండి
Avatar 3: ‘పండోరా’ సృష్టించింది.. మన అమ్మాయే
కొత్తగూడ అడవుల్లో భారీ జంతువు ప్రత్యక్షం!
