వెంటాడిన భయం.. దానితో ఇద్దరు మృతి..

Updated on: Sep 19, 2025 | 7:49 PM

మనస్తాపంతో ఒకరు ఆత్మహత్య చేసుకోబోతే.. అందుకు కారణమైనవారు భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ క్రమంలో ఇద్దరు మృతి చెందగా ఇద్దరు చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన పల్నాడు జిల్లాలో జరిగింది. అప్పు తీసుకున్న వ్యక్తిని అప్పు చెల్లించాలని డిమాండ్‌ చేయడమే వారి చావుకు కారణమైంది. కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడగా తల్లీ, కుమారుడు మృతి చెందారు.

తండ్రి ఆస్పత్రిపాలై భార్య, కుమారుడ్ని పోగొట్టుకొని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ఫణిదెంలో శ్రీనివాసరావు అనే వ్యక్తి చిల్లర కొట్టు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. గ్రామంలోని వారికి అప్పుడప్పుడూ అవసరానికి అప్పులిస్తుంటాడు. ఈ క్రమంలోనే అదే గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తి శ్రీనివాసరావు వద్ద తన బైకు తాకట్టు పెట్టి నలభై వేలు, మరో 50 వేలు చేబదులుగా తీసుకున్నాడు. అనంతరం కొద్ది రోజుల్లోనే నలభై వేల రూపాయలు చెల్లించి బైక్ విడిపించుకున్నాడు. ఇక మిగిలిన యాభై వేల రూపాయలు చెల్లించలేకపోయాడు. దీంతో శ్రీనివాసరావుతో పాటు అతని భార్య పూర్ణ కుమారి, కొడుకు వెంకటేష్ కూడా వెంకటేశ్వర్లును అప్పు చెల్లించమని అడిగేవారు. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం శ్రీనివాసరావు భార్య పూర్ణ కుమారి.. వెంకటేశ్వర్లు వద్దకు వెళ్లి యాభై వేలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసింది. ఆమె డబ్బులు చెల్లించాలని గట్టిగా అడగడంతో మనస్థాపానికి గురైన వెంకటేశ్వర్లు పురగు మందు త్రాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అతన్ని బంధువులు ఆస్పత్రికి తరలించగా చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలిసి కంగారు పడిన శ్రీనివాసరావు ఇంటికెళ్లి భార్య, కుమారుడితో డబ్బులు ఎందుకు అడిగారంటూ గొడవ పడ్డాడు… వెంకటేశ్వర్లు పరిస్థితి చెప్పి..అతను చనిపోతే తామంతా జైలుకు వెళ్లాల్సి వస్తుందని భయపడ్డారు. దానికంటే చనిపోవడం మేలనుకున్నారు. ఈ క్రమంలోనే శ్రీనివాసరావు ఇంట్లో పురుగు మందు తాగేశాడు. భార్య, కుమారుడు పొలానికి వెళ్లి వ్యవసాయ బావిలో దూకేసారు. శ్రీనివాసరావును స్థానికులు ఆసుపత్రికి తరలించారు. బావిలో దూకిన పూర్ణ కుమారి, వెంకటేష్ చనిపోయారు. భార్య, కొడుకు చనిపోయిన విషయం తెలియగానే శ్రీనివాసరావు కన్నీరు మున్నీరుగా విలపించాడు. ఆసుపత్రిలో శ్రీనివాసరావు కోలుకుంటున్నాడు. మరొక వైపు వెంకటేశ్వర్లకి ప్రాణాపాయం తప్పిందని వైద్యులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జస్ట్ మిస్.. తృటిలో తప్పించుకున్న బీజేపీ ఎంపీ

సీఎం చెప్పారు.. బుల్లెట్‌ దిగింది! హీరోయిన్‌కి యోగి మార్క్‌ న్యాయం

మహిళా కండక్టర్ సెల్ఫీ వీడియోపై ఆర్టీసీ రియాక్షన్

త్వరలోనే భారత్‌లో 6 జీ సేవలు.. హైదరాబాద్ ఐఐటీది కీలక పాత్ర

ఆర్టీసీలో ఉద్యోగమే మీ లక్ష్యమా? అయితే ఈ గుడ్‌ న్యూస్‌ మీకే