హోటల్ ముందు ఆగిన కారులో అరుపులు.. ఏంటా అని చూడగా
ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు చేపట్టినా స్మగ్లింగ్ గ్యాంగుల ఆగడాలకు అడ్డుకట్ట పడటంలేదు. రోజూ ఎక్కడో చోట పలు రకాల స్మగ్లింగ్ జరుగుతూనే ఉంది.తాజాగా శ్రీకాకుళం జిల్లాల్లో విదేశీ పక్షులను అక్రమ రవాణా చేస్తూ కొందరు కేటుగాళ్లు పట్టుబడ్డారు. పలాస–కాశీబుగ్గ రేంజ్ అటవీశాఖ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో ఈ స్మగ్లింగ్ బట్టబయలైంది.
పలాస సమీపంలోని 16వ నెంబర్ జాతీయ రహదారి పక్కన ఉన్న ఓ రెస్టారెంట్‌లో విశ్రాంతి తీసుకుంటున్న స్మగ్లర్లను అటవీశాఖ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. వారి కారులో వెతకగా.. మొత్తం 236 విదేశీ పక్షులు దొరికాయి. ఈ పక్షులను కలకత్తా నుంచి చెన్నైకి అక్రమంగా రవాణా చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. వివిధ జాతులకు చెందిన ఈ రంగురంగుల పక్షులకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉండటంతో వీటిని స్మగ్లింగ్ చేస్తున్నారని, వీటి విలువ లక్షల్లో ఉంటుందని అటవీశాఖ అంచనా వేస్తోంది. పట్టుబడిన ఇద్దరు స్మగ్లర్లను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న పక్షులను ప్రస్తుతం పలాస–కాశీబుగ్గ ఫారెస్ట్ ఆఫీస్‌కు తరలించామని, తదుపరి చర్యలు కొనసాగుతున్నాయని రేంజ్ అధికారి మురళీకృష్ణం నాయుడు తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జైలుకెళ్తే ఎంతటి మంత్రి అయినా పదవి ఊస్ట్.. కేంద్రం కొత్త చట్టం
అప్పుడు చిరును నమ్మి ఉంటే.. NTRకు అలా జరిగేది కాదేమో..!
12 ఏళ్ల కూతురురే నటి రెండో పెళ్లికి పెళ్లి పెద్ద
కలుపు తీద్దామని పొలానికి వెళ్తే.. లక్ష్మీ దేవి తలుపు తట్టింది
బన్నీకే మొదటి ప్రాధాన్యత దీపిక నిర్ణయంతో.. బాలీవుడ్ మేకర్స్ షాక్