అమ్మకు వందేళ్ల వందనం.. ఒకే వేదికపై ఆరు తరాలు

|

Oct 04, 2023 | 9:59 AM

ప్రస్తుత సమాజంలో బిజీ బిజీ జీవితంలో కన్న బిడ్డలకు తల్లిదండ్రులే బరువైపోతున్నారు. బిడ్డ పుట్టినప్పుడు ఉన్న సంతోషం తల్లిదండ్రులకు ఎందులోనూ ఉండదు. కానీ, తమ ఎదుగుదలకు కారణమైన తల్లిదండ్రులనే వదిలించుకోవాలనే క్రమంలో కొందరు వారిని వృద్ధాశ్రమాల పాలు చేస్తున్నారు. కానీ ఇక్కడ అలాంటి వాటన్నింటికీ భిన్నంగా వారి కుటుంబంలో ఆరు తరాలు కలిసి ఓ పండు వృద్ధురాలికి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.

ప్రస్తుత సమాజంలో బిజీ బిజీ జీవితంలో కన్న బిడ్డలకు తల్లిదండ్రులే బరువైపోతున్నారు. బిడ్డ పుట్టినప్పుడు ఉన్న సంతోషం తల్లిదండ్రులకు ఎందులోనూ ఉండదు. కానీ, తమ ఎదుగుదలకు కారణమైన తల్లిదండ్రులనే వదిలించుకోవాలనే క్రమంలో కొందరు వారిని వృద్ధాశ్రమాల పాలు చేస్తున్నారు. కానీ ఇక్కడ అలాంటి వాటన్నింటికీ భిన్నంగా వారి కుటుంబంలో ఆరు తరాలు కలిసి ఓ పండు వృద్ధురాలికి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆ వేడుక చూసేందుకు ఆ కుటుంబ సభ్యులతో పాటు తమ బంధువులను పిలిచి వేడుక జరుపుకున్నారు. తల్లిదండ్రుల పట్ల వారికి ఉన్న గౌరవాన్ని నలుగురికి చాటి చెప్పే విధంగా పలువురి ప్రశంసలు పొందారు. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామానికి చెందిన కంచర్ల వెంకట రత్నమ్మ అనే వృద్ధురాలు 101 సంవత్సరాలు పూర్తి చేసుకుని 102 వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఆ శతాధిక వృద్ధురాలి జన్మదిన వేడుకలను కుటుంబ సభ్యులు తర తరాలకు గుర్తుండిపోయేలా నిర్వహించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పురిట్లోనే బిడ్డ మృతి.. అంతలోనే తల్లి కూడా

MS Dhoni: కొత్త లుక్ లో అదరగొట్టిన మహేందర్ సింగ్ ధోనీ

మాల్‌లో ఫ్రిడ్జ్‌ డోర్‌ తెరిచి.. ప్రాణం కోల్పోయిన చిన్నారి

సచివాలయంలో గంజాయి మొక్క కలకలం !!

బాబోయ్ ఎంతపెద్ద తిమింగలమో !! కేరళ తీరంలో టెన్షన్