అండమాన్ నికోబార్ దీవులకు.. పేర్లు పెట్టే ఛాన్స్
ప్రధాని మోదీ స్ఫూర్తితో అండమాన్ నికోబార్‌లోని జనావాసాల్లేని 586 దీవులకు పేర్లు సూచించేందుకు ప్రజలకు అవకాశం కల్పించారు. ఆదివాసీ వారసత్వం, స్వాతంత్ర్య సమరయోధులు, ప్రముఖులు, జంతుజాలం ఆధారంగా పేర్లను ప్రతిపాదించవచ్చు. చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యతను పెంపొందించడమే లక్ష్యం. ఆసక్తి ఉన్నవారు తమ సూచనలను పంపగలరు.
ఇటీవల అండమాన్ నికోబార్ దీవుల్లో పర్యటించిన ప్రధాని మోదీ అక్కడి దీవులకు వీర జవాన్ల పేరు పెట్టారు. ఆ అవకాశం ఇప్పుడు సామాన్యులకు కూడా కల్పిస్తూ అక్కడి యంత్రాంగి నిర్ణయం తీసుకుంది. అండమాన్ నికోబార్‌లోని వందలాది దీవులకు పేర్లు పెట్టండి అంటూ ప్రకటించింది. ముఖ్యంగా జనావాసాలు లేని 586 దీవులకు పేర్లు సూచించాలని సామాన్యులకు విజ్ఞప్తి చేసింది. స్థానిక ఆదివాసీ వారసత్వం, స్వాతంత్ర్య సమరయోధులు, ప్రముఖ వ్యక్తులు, అమరులు, ప్రత్యేకమైన వృక్ష, జంతుజాలం, జాతీయ ప్రాముఖ్యత కలిగిన చారిత్రక సంఘటనలు, భౌగోళిక లక్షణాలు కలిగిన పేర్లను సూచించవచ్చని తెలిపింది. కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ దీవుల భూభాగం 8249 చ.కి.మీటర్లు. ఇక్కడ మొత్తం 836 దీవులు ఉన్నాయి. వీటిలో 31 ద్వీపాలు మాత్రం నివాసయోగ్యంగా ఉన్నాయి. ప్రస్తుతం 586 దీవులకు పేర్లు లేవు. ప్రస్తుతం ప్రత్యేక నంబర్లతో వాటిని గుర్తిస్తున్నారు. నివాసయోగ్యం కాని ఇటువంటి 21 దీవులకు ప్రధాని మోదీ 2023 జనవరిలో పేర్లు పెట్టారు. దీవుల సర్వే, సముద్ర సరిహద్దులు, మ్యాప్‌లు తయారు చేసేందుకు సర్వే ఆఫ్ ఇండియా సాంకేతిక సాయం అందిస్తుంది. దీవులకు పేర్లు సూచించాలని వివిధ ఆదివాసీ వర్గాలు, మాజీ సైనికులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, చరిత్రకారులు, పర్యావరణవేత్తలు సహా సాధారణ ప్రజలకు విజ్ఞప్తి చేశాం. ఇదో విశిష్టమైన పని అని అండమాన్ నికోబార్ కళా, సాంస్కృతిక విభాగ డైరెక్టర్ ప్రియాంకా కుమారి పేర్కొన్నారు. పేర్లపై నిర్ణయం తీసుకున్న తర్వాత తుది ఆమోదం కోసం వాటిని కేంద్ర హోం శాఖకు పంపిస్తామని చెప్పారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏపీలో కేరళ తరహా టూరిజం.. లగ్జరీ బోట్లలో లాహిరి లాహిరి లాహిరిలో
డిసెంబర్ 28న ఆ ఎయిర్‌పోర్ట్‌లో భారీ రద్దీ
ఎంత పెద్ద నేరం జరిగినా పోలీసులకి చెప్పరు !! ఆ అపార్ట్‌మెంట్‌లో సొంత చట్టం అమలు
12 ఏళ్లకు మించి బతకడన్నారు… కట్ చేస్తే.. వేలంలో ఆ క్రికెటర్ రూ.25 కోట్ల ధర పలికాడు
50 ఏళ్లు వచ్చినా పెళ్లికి నో…! కారణం తెలిస్తే మీరూ షాకవుతారు
