ప్రతిరోజూ సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. సాధారణంగా పిల్లలు చాలా యాక్టివ్‌గా ఉంటారు. వారు చేసే అల్లరిపనులు ఒక్కోసారి చాలా నవ్వు తెప్పిస్తుంటాయి. కానీ ఆ అల్లరిలోనే వారిలోని ప్రతిభ బయటపడుతుంది. తాజాగా ఓ కుర్రాడిని వాళ్లమ్మ ఏవో సరుకులు తీసుకు రమ్మని బయటకు పంపింది. అయితే వచ్చేటప్పుడు ఆ బాలుడు తన ఇంటిముందు ఉన్న ఓ బైక్ ముందు ఆగి డాన్స్ చేయడం మొదలు పెట్టాడు. అది యాంటీ థెఫ్ట్ అలారం బైక్. దాన్నుంచి వచ్చే సౌండ్‌కి అనుగుణంగా ఆ కుర్రాడు సూపర్బ్‌గా డాన్స్ చేశాడు. ఆ బాలుడి ఎక్స్ప్రెషన్స్, బాడీలాంగ్వేజ్ మ్యూజిక్‌కి తగ్గట్టుగా ఆ బాలుడి స్టెప్స్... చూస్తే వావ్ అంటారు.. ఈ వీడియో మన టెక్ దిగ్గజం ఆనంద్ మహీంద్రా కంటపడింది. ఆ బాలుడి ట్యాలెంట్‌కి ఆయన ఫిదా అయిపోయారు.బాలుడు డాన్స్ చేస్తున్న వీడియోను తన ట్విట్టర్లో షేర్ చేస్తూ.. ఈ బాలుడి డాన్స్ చూసి నవ్వు ఆగలేదని, ఇప్పటికీ నవ్వుతూనే ఉన్నాను, నా వీకెండ్ ఇప్పుడే మొదలైంది అంటూ క్యాప్షన్ ఇచ్చారు. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోను 8 లక్షలమందికి పైగా వీక్షించారు. 60 వేలమందికి పైగా లైక్ చేశారు. 14 వేలమంది రీట్వీట్ చేశారు. ఫన్నీ కామెంట్స్‌తో హోరెత్తించారు. మరిన్ని వీడియోస్ కోసం: Videos Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్.. Allu Arjun Vibrant Look: ఉగ్రగంగమ్మగా పుష్పరాజ్.. సీన్ దద్దరిల్లాలే.. నెట్టింట ఊచకోత కోస్తున్న బన్నీ వీడియో.. Pushpa-2 Video: పుష్ప అడుగుపడితే.. పులి కూడా కుక్క అయిపోవాలే..! సోషల్ మీడియాను రఫ్పాడిస్తున్న పుష్ప..