Watch Video: గుజరాత్‌లో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న ఓవర్ బ్రిడ్జి.. వీడియో.
గుజరాత్‌లో నిర్మాణంలో ఉన్న ఓ బ్రిడ్జ్ అకస్మాత్తుగా పెద్ద శబ్దంతో కుప్పకూలింది. బనస్కాంతా జిల్లాలోని పాలన్‌పూర్ సిటీలో ఈ దుర్ఘటన జరిగింది. ఓవర్‌బ్రిడ్జిలోని కొంత భాగం రోడ్డుపైనా మరికొంత రైలు పట్టాల వద్ద కిందపడటంతో హాహాకారాలు చెలరేగాయి. భారీ సంఖ్యలో జనం ఆ ప్రాంతానికి తరలివచ్చారు. కూలిన బ్రిడ్జి స్లాబ్ కింద ఓ ట్రాక్టర్‌తో పాటు ఓ రిక్షా నుజ్జునుజ్జయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. అయితే ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
గుజరాత్‌లో నిర్మాణంలో ఉన్న ఓ బ్రిడ్జ్ అకస్మాత్తుగా పెద్ద శబ్దంతో కుప్పకూలింది. బనస్కాంతా జిల్లాలోని పాలన్‌పూర్ సిటీలో ఈ దుర్ఘటన జరిగింది. ఓవర్‌బ్రిడ్జిలోని కొంత భాగం రోడ్డుపైనా మరికొంత రైలు పట్టాల వద్ద కిందపడటంతో హాహాకారాలు చెలరేగాయి. భారీ సంఖ్యలో జనం ఆ ప్రాంతానికి తరలివచ్చారు. కూలిన బ్రిడ్జి స్లాబ్ కింద ఓ ట్రాక్టర్‌తో పాటు ఓ రిక్షా నుజ్జునుజ్జయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. అయితే ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. సంఘటనా స్థలికి చేరుకున్న రైల్వే సిబ్బంది, పోలీసు అధికారులు ప్రమాదం ఎలా జరిగిందన్నఅంశంపై దృష్టిపెట్టారు. బ్రిడ్జి కుప్పకూలిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా గత ఏడాది ఇదే సమయంలో గుజరాత్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మోర్బి పట్టణంలో మచ్చూ నదిపై కేబుల్ బ్రిడ్జి ఒక్కసారిగా నదిలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 132 మంది దుర్మరణం పాలయ్యారు. ప్రమాద సమయంలో వంతెనపై 400 మందికి పైగా పర్యాటకులు ఉన్నట్లు సమాచారం.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
