AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Magic Mirror: మ్యాజిక్ మిర్రర్.. దీని ప్రత్యేక ఏంటో తెలిస్తే షాకే.! చూస్తే వివస్త్రలుగా కనిపిస్తారంటూ..

Magic Mirror: మ్యాజిక్ మిర్రర్.. దీని ప్రత్యేక ఏంటో తెలిస్తే షాకే.! చూస్తే వివస్త్రలుగా కనిపిస్తారంటూ..

Anil kumar poka
|

Updated on: Aug 20, 2023 | 8:58 AM

Share

టెక్నాలజీ యుగంలోనూ కేటుగాళ్ల మాయలో పడి మోసపోతున్నారు కొందరు. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ కు చెందిన 72 ఏళ్ల వృద్ధుడిని మ్యాజిక్ మిర్రర్ పేరుతో నిండా ముంచేశారు మాయగాళ్లు. అవును, కొందరు కేటుగాళ్లు ఓ వృద్ధుడికి అద్దం చూపించి, అదకొ మ్యాజిక్‌ మిర్రర్‌ అని, ఈ అద్దంలోనుంచి ఎవరిని చూసినా నగ్నంగా కనిపిస్తారని, అంతేకాకుండా ఆ అద్దం భవిష్యత్తు గురించి కూడా చెబుతుందని తీయగా కబుర్లు చెప్పి నమ్మించారు.

టెక్నాలజీ యుగంలోనూ కేటుగాళ్ల మాయలో పడి మోసపోతున్నారు కొందరు. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ కు చెందిన 72 ఏళ్ల వృద్ధుడిని మ్యాజిక్ మిర్రర్ పేరుతో నిండా ముంచేశారు మాయగాళ్లు. అవును, కొందరు కేటుగాళ్లు ఓ వృద్ధుడికి అద్దం చూపించి, అదకొ మ్యాజిక్‌ మిర్రర్‌ అని, ఈ అద్దంలోనుంచి ఎవరిని చూసినా నగ్నంగా కనిపిస్తారని, అంతేకాకుండా ఆ అద్దం భవిష్యత్తు గురించి కూడా చెబుతుందని తీయగా కబుర్లు చెప్పి నమ్మించారు. అంతే ఆ మ్యాజిక్‌ మిర్రర్‌ కోసం ఆశపడి ఏకంగా 9 లక్షల రూపాయలు పొగొట్టుకున్నాడు. దుండగులు తమను తాము సింగపూర్‌కు చెందిన ప్రాచీన కళాకృతులు సేకరించే కంపెనీకి చెందినవారిగా పరిచయం చేసుకున్నారు. ఈ అద్దాన్ని నాసా శాస్త్రవేత్తలు సైతం ఉపయోగిస్తారని,దీని విలువ 2 కోట్లు అని, చెప్పారు. అయితే 9 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. అద్దం తీసుకునేందుకు భువనేశ్వర్ కు రావాలని తెలిపారు. దీంతో 9 లక్షలు చెల్లించుకున్నాడు వృద్ధుడు. తీరా చేతికి వచ్చిన అద్దం ముఖ భాగం విరిగిపోయి ఉండడంతో విరిగిన అద్దం నాకొద్దంటూ తిరస్కరించాడు. చివరికి ఈ కథ పోలీసు స్టేషన్ కు చేరింది. వృద్ధుడిని నిండా ముంచిన ముగ్గురు పశ్చిమబెంగాల్ రాష్ట్ర వాసులుగా గుర్తించిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...

Follow Us