Electric bike: ఎలక్ట్రిక్ బైక్ తయారుచేసిన ఇంటర్ విద్యార్థి.. 4 గంటల ఛార్జింగ్ 70 కి.మీ.
ప్రతిఒక్కరిలో ఏదో ఒక ట్యాలెంట్ ఉంటుంది. ఏదొక సందర్భంలో అది బయటపడుతుంది. దానికి డిగ్రీలు, సర్టిఫికెట్‌లు కూడా అవసరం లేదని కొందరు నిరూపిస్తారు. మెదడుకి కాస్త పదునుపెడితే చాలు ఏదైనా సాధించవచ్చని ఓ యువకుడు నిరూపించాడు. అవును యూట్యూబ్‌లో చూసి ఓ ఇంటర్ విద్యార్థి ఎలక్ట్రిక్ బైక్ తయారు చేసి ఔరా అనిపించాడు. గ్రామీణ ప్రాంత ప్రజలు పెట్రోలు భారాన్ని మోయలేక ఇబ్బందులు పడుతున్న..
ప్రతిఒక్కరిలో ఏదో ఒక ట్యాలెంట్ ఉంటుంది. ఏదొక సందర్భంలో అది బయటపడుతుంది. దానికి డిగ్రీలు, సర్టిఫికెట్‌లు కూడా అవసరం లేదని కొందరు నిరూపిస్తారు. మెదడుకి కాస్త పదునుపెడితే చాలు ఏదైనా సాధించవచ్చని ఓ యువకుడు నిరూపించాడు. అవును యూట్యూబ్‌లో చూసి ఓ ఇంటర్ విద్యార్థి ఎలక్ట్రిక్ బైక్ తయారు చేసి ఔరా అనిపించాడు. గ్రామీణ ప్రాంత ప్రజలు పెట్రోలు భారాన్ని మోయలేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వారి సమస్యకు పరష్కారాన్ని చుపాలనే ఉద్దేశ్యంతో ఆ విద్యార్ది ఓ ఎలక్ట్రిక్ బైక్ ను తయారు చేయాలనుకున్నాడు. ఒక్క సారి ఛార్జ్ చేస్తే సుమారు 60 నుండి 70 కిలోమీటర్లు నడిచే బైకును తయారు చేశాడు. ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం కొమ్మర గ్రామానికి చెందిన మండా దిలీప్ కుమార్ దూభచర్ల లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశాడు. దిలీప్ కు మెకానికల్ అంటే ఇష్టం. ఆ క్రమంలోనే స్కూల్లో చదువుతున్న రోజుల్లో సైన్స్ ఫెయిర్లో ఎన్నో ఆవిష్కరణలు చేశాడు. వాటికి అవార్డులు సైతం పొందాడు. అదే ఆసక్తితో తక్కువ ధరలో బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ బైక్ ను తయారు చేయాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా యూట్యూబ్లో ఎలక్ట్రిక్ బైక్ ఎలా తయారు చేయాలో, వాటికి ఏ పరికరాలు కావాలో సెర్చ్ చేశాడు. ఓ పాత ప్లాటినా బైక్ ను స్క్రాప్ లో కొని, దానికి బ్యాటరీలు, ఇతర పరికరాలు ఆన్‌లైన్‌లోనే కొని, ఎలక్ట్రిక్ బైక్ తయారు చేశాడు. ఈ బైక్‌కి నాలుగు గంటలు చార్జింగ్ పెడితే సుమారు 60 నుంచి 70 కిలోమీటర్ల ప్రయాణిస్తుంది. ఈ బైకు తయారు చేయడానికి 17 వేల రూపాయలు మాత్రమే ఖర్చయిందని తెలిపాడు. అంత తక్కువ ధరలో ఎలక్ట్రికల్ బైక్ తయారు చేయడంతో గ్రామస్తులు దిలీప్ కుమార్ ను అభినందిస్తున్నారు. ఈ బైక్ పై ముగ్గురు వ్యక్తులు ఈజీగా ప్రయాణించవచ్చని, ఒక చిన్న కుటుంబానికి ఈ బైక్ ఎంతగానో ఉపయోగపడుతుందని, తాను ఎక్కడికి వెళ్లినా ఆ బైక్ పైనే వెళ్తున్నానని తెలిపాడు. ఈ బైక్ మరో ప్రత్యేకత ఏటంటే.. ఇది ముందుకే కాకుండా రివర్స్ కూడా ప్రయాణిస్తుందనీ, ప్రభుత్వం ప్రోత్సహిస్తే రానున్న రోజుల్లో ఇలాంటివి మరిన్ని తయారుచేస్తానని దిలీప్ కుమార్ అంటున్నాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..