Lottery: వృద్ధుడికి పట్టిన అదృష్టం.. అలవాటులో పొరపాటుగా కొన్న లాటరీ టికెట్‌. దెబ్బకు లైఫే మారిపోయింది..

|

Jan 27, 2023 | 9:52 AM

అదృష్టం ఎప్పుడు ఎవర్ని ఎలా వరిస్తుందో తెలియదు. అదృష్టంతోపాటు కాలం కలిసిరావాలి. అలా జీవిత చరమాంకంలో ఉన్న ఓ వృద్ధుడిని అదృష్టం వరించింది. ఏకంగా 5 కోట్ల లాటరీ తగిలింది. దీంతో అతని


అదృష్టం ఎప్పుడు ఎవర్ని ఎలా వరిస్తుందో తెలియదు. అదృష్టంతోపాటు కాలం కలిసిరావాలి. అలా జీవిత చరమాంకంలో ఉన్న ఓ వృద్ధుడిని అదృష్టం వరించింది. ఏకంగా 5 కోట్ల లాటరీ తగిలింది. దీంతో అతని ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. పంజాబ్​లోని మొహాలి జిల్లాలో మహంత్ ద్వారకా దాస్ నివాసముంటున్నాడు. అతడి కుమారుడు నరేంద్ర కుమార్ కారు డ్రైవర్​గా పని చేస్తున్నాడు. మహంత్ కు లాటరీ టికెట్లు కొనడం అలవాటు. ఏదో ఆశ.. ఎప్పుడో అప్పుడు తగలకపోతుందా అనుకుంటూ తరచూ లాటరీ టికెట్లు కొంటూ ఉంటాడు. అలా పంచకుల రోడ్డు సమీపంలో ఉన్న ఓ లాటరీ షాపులో టికెట్ కొన్నాడు. తాజాగా తీసిన లక్కీ డ్రాలో మహంత్​లాటరీ టికెట్​నంబర్​ వచ్చింది. ఈ విషయాన్ని షాపు యజమాని మహంత్ కు తెలిపాడు. 5 కోట్లు లాటరీ తగిలిందని చెప్పి పూల మాలల వేసి స్వీట్లు తినిపించాడు. దీంతో ద్వారకా దాస్ ఇంట్లో సందడి నెలకొంది. ఈ విషయం తెలిసుకున్న గ్రామస్థులందరూ మహంత్​ఇంటికి తరలి వస్తున్నారు. అయితే.. పన్నులు అన్నీ పోగా మిగతా డబ్బు మహంత్​కు వస్తుందని లాటరీ షాపు యజమాని తెలిపాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Chiranjeevi – Pawan Kalyan: వైసీపీతో పవన్ పోరాటం చేస్తే నాకేంటి సంబంధం.. చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ ..

Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..

Love couples: శృతిమించుతున్న యువతీ యువకులు జల్సాలు.. బైక్‌పై ప్రేమజంట వెకిలిచేష్టలు.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Published on: Jan 27, 2023 09:50 AM