Auto Garden: వారెవ్వా.. ఇది ఆటోనా గార్డెనా..? కదిలే తోట అంటున్న ప్రయాణికులు..! వీడియో..

|

Sep 04, 2023 | 2:22 PM

పచ్చని మొక్కలు, పూలు మనసుకు కొంత ఆనందాన్ని ఇస్తాయి. ఒత్తిడికి గురైన మనసును ప్రశాంతంగా ఉంచే శక్తి మొక్కలకు ఉంది. అయితే, ఇళ్ల ముందు, పార్కుల్లో, ఆఫీసుల ముందు మొక్కలను చూస్తుంటాం. ఆటోలో మొక్కలు పెంచటం ఎక్కడైనా ఎప్పుడైనా చూశారా..? అవును మీరు విన్నది నిజమే.. కదిలే తోటలాంటి ఈ ఆటో ప్రయాణికులను ఆకర్షిస్తోంది. సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.

పచ్చని మొక్కలు, పూలు మనసుకు కొంత ఆనందాన్ని ఇస్తాయి. ఒత్తిడికి గురైన మనసును ప్రశాంతంగా ఉంచే శక్తి మొక్కలకు ఉంది. అయితే, ఇళ్ల ముందు, పార్కుల్లో, ఆఫీసుల ముందు మొక్కలను చూస్తుంటాం. ఆటోలో మొక్కలు పెంచటం ఎక్కడైనా ఎప్పుడైనా చూశారా..? అవును మీరు విన్నది నిజమే.. కదిలే తోటలాంటి ఈ ఆటో ప్రయాణికులను ఆకర్షిస్తోంది. సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. చెన్నై ఆటో డ్రైవర్ కుబెందిరన్ Instagramలో షేర్ చేసిన ఆటో వీడియో వెరీ స్పెషల్‌. ఈ ఆటోలో అన్నీ మొక్కలే కనిపిస్తాయి. ట్రై సైకిల్‌లో కుండీలు పెట్టి అందులో మొక్కలు పెంచుతున్నాడు. అంతే కాకుండా మోటివేషనల్ బుక్స్, డ్రింకింగ్ వాటర్ సదుపాయాన్ని ఏర్పాటు చేశాడు. అవయవ దానం, పర్యావరణ పరిరక్షణపై మంచి మాటలు కూడా ఈ ఆటోలో పోస్టర్‌ల రూపంలో కనిపిస్తాయి. ఆటో పైభాగం కూడా పచ్చదనం, పూలతో నింపేసారు. సీటు వెనుక కూడా మొక్కలు కనిపిస్తాయి. అంతే కాదు విరాళం ఇచ్చే వారి కోసం రెండు ప్రత్యేక బాక్సులు కూడా అక్కడ ఏర్పాటు చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోను మిలియన్ల మందికి వీక్షించారు. సోషల్‌ మీడియా యూజర్లు ఇది అద్భుతం అంటున్నారు.. ఇది ఒక ట్రావెలింగ్ పార్క్! అంటూ ప్రశంసిస్తున్నారు.. అది రిక్షా కాదు మినీ గార్డెన్‌ అని మరొకరు కొనియాడుతున్నారు..

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..