Viral Video: పాట కోసం ఇండియన్ డిష్ ‘జిలేబీ’ తయారు చేసిన అమెరికన్ సింగర్..! వైరలవుతోన్న వీడియో

అమెరికన్ సింగర్ కం సాంగ్ రైటర్‌ జాసన్ డెరులో ప్రస్తుతం ఓ వంటకాన్ని చేసి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాడు. అది కూడా మన ఇండియన్ ఫేమస్ డిష్‘జలేబీ’ని చేయడంతో.. ఇండియన్స్‌ని విసరీతంగా ఆకట్టుకుంటోంది.

Viral Video: పాట కోసం ఇండియన్ డిష్ జిలేబీ తయారు చేసిన అమెరికన్ సింగర్..! వైరలవుతోన్న వీడియో
American Singer Jason Derulo

Updated on: Jun 30, 2021 | 11:04 AM

American Singer Jason Derulo: అమెరికన్ సింగర్ కం సాంగ్ రైటర్‌ జాసన్ డెరులో ప్రస్తుతం ఓ వంటకాన్ని చేసి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాడు. అది కూడా మన ఇండియన్ ఫేమస్ డిష్ ‘జలేబీ’ని చేయడంతో.. విసరీతంగా ఆకట్టుకుంటోంది. జిలేబీ చేస్తున్న వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో వైరల్‌గా మరింది. మూడు రోజుల క్రితం విడుదల చేసిన ఈ వీడియో 3 లక్షలకు పైగా లైక్‌లతోపాటు మరెన్నో కామెంట్లతో దూసుకపోతోంది. ఈ వీడియోలో తను రాసి, పాడిన జిలేబీ బేబీ సాంగ్‌ను ఆలపిస్తూ జిలేబీని తయారుచేశాడు. అన్ని పదార్థాలను సరైన క్వాంటిటీతో తీసుకుని జిలేబీని చేసినట్లు తెలిపాడు. బ్యాక్ గ్రౌండ్‌లో జిలేజీ సాంగ్‌ ప్లే చేస్తూ మనదేశపు డిష్‌ తయారీలో మునిగిపోయాడు. అయితే అతను నివసిస్తున్న ఏరియాలో చాలామందికి అసలు జిలేబీ అంటే ఏంటో తెలియదంట.

అందుకోసమే ఈ వంటకాన్ని నేర్చుకుని అక్కడి వారికి పరిచయం చేసేందుకు తయారుచేసినట్లు తెలిపాడు. మరోవైపు జిలేజీ బేబీ సాంగ్‌ను 2020లో మొదటి సారిగా విడుదల చేశాడు. అప్పటి నుంచి ఇది సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోనే కొనసాగుతోంది. ఈ పాటలో ఉపయోగించిన జిలేబీ అనే పదం కోసమే జిలేబీ అంటే ఏంటో తెలుసుకుని, దానిని తయారుచేసినట్లు వెల్లడించాడు. ‘జిలేబీ అంటే ఏమిటోనని ఆశ్చర్యపోతున్నారా’ అంటూ క్యాప్షన్ ఇచ్చి వీడియోను షేర్ చేశాడు. అయితే కొంతమంది ఇదేంటి అని అడగగా, మరికొంత మంది జుల్బియా అంటూ, మరికొంతమంది ఇస్లామిక్ దేశాల్లో రంజాన్ ఉపవాసాల్లో భాగంగా జుల్బియాను తీసుకుంటారని కామెంట్లు చేశారు.
ఆ వీడియోను మీరూ చూడండి:

Also Read:

Viral Video: 10 కోడి గుడ్లు మింగి.. కక్కిన ఆరడుగుల కోబ్రా.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..

యూఏఈ లోనే టీ20 వరల్డ్ కప్..భారత్‌ నుంచి యూఏఈకి తరలించినట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ:T20 World Cup video.

లీకైన హరిహర వీర మల్లు పవన్ కళ్యాణ్ ఫైట్ సీన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్:Hara Hara Veera Mallu video leaked