అంబులెన్స్ డ్రైవర్ నిర్వాకం.. మద్యం కోసం బండిని ఆపి.. పేషెంట్‌కూ ఓ ‘పెగ్గు’ పోసి..
సాధ్యమైనంత త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లి.. బాధితుడి ప్రాణాలు కాపాడేందుకు అంబులెన్స్‌ను ఆశ్రయిస్తాం. కానీ, ఓ అంబులెన్సు డ్రైవరు మాత్రం.. మద్యం సేవించేందుకు వాహనాన్ని రోడ్డుమీదే కొంతసేపు ఆపిన ఘటన ఒడిశాలో వెలుగు చూసింది.
సాధ్యమైనంత త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లి.. బాధితుడి ప్రాణాలు కాపాడేందుకు అంబులెన్స్‌ను ఆశ్రయిస్తాం. కానీ, ఓ అంబులెన్సు డ్రైవరు మాత్రం.. మద్యం సేవించేందుకు వాహనాన్ని రోడ్డుమీదే కొంతసేపు ఆపిన ఘటన ఒడిశాలో వెలుగు చూసింది. అక్కడితో ఆగకుండా వాహనంలో ఉన్న పేషెంటుకూ ఓ పెగ్గు అందించిన వైనం విస్మయానికి గురిచేస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఒడిశా జగత్సింగ్‌పూర్ జిల్లాలోని తిర్తోల్ హైవేలో ఓ బాధితుడిని తీసుకెళ్తున్న అంబులెన్సు రోడ్డు పక్కన ఆగింది. వాహనం దిగిన అంబులెన్సు డ్రైవర్.. ఓ మద్యం బాటిల్‌ను తీసి గ్లాసులో పోసుకొని తాగడం మొదలుపెట్టాడు. అక్కడితో ఆగకుండా వాహనంలో ఉన్న పేషెంటుకు ఓ పెగ్గు అందించాడు. కాలికి గాయమై, స్ట్రెచర్‌పై పడుకొని ఉన్న ఆ వ్యక్తి కూడా దాన్ని సేవించాడు. ఆ సమయంలో బాధితుడి పక్కన ఓ మహిళ, చిన్న అబ్బాయి కూడా ఉన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇయర్ బడ్స్, బ్లూటూత్‌తో పనిలేదు..ఓన్లీ మ్యూజిక్ క్యాప్..
ఇదేం డ్యాన్స్‌రా బాబు.. నవ్వలేక పడిపోతున్నారు
ఏమి టాలెంట్ బాసూ.. రోడ్డుమీద పరిగెత్తే హెలికాఫ్టర్ !!
దినసరి కూలీకి దిమ్మతిరిగే షాక్ !! రూ.14 కోట్ల పన్ను విధించిన ఐటీ శాఖ !!
Tamma Reddy: ‘చిరంజీవికి తోకలెందుకు’ తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్