దినసరి కూలీకి దిమ్మతిరిగే షాక్ !! రూ.14 కోట్ల పన్ను విధించిన ఐటీ శాఖ !!
రోజువారీ కూలి పనులు చేసుకుని బ్రతికే ఓ వ్యక్తికి ఐటీశాఖ పెద్ద షాకిచ్చింది. 14 కోట్ల రూపాయలు పన్ను చెల్లించాలంటూ సదరు కూలీకి నోటీసులు జారీ చేసింది. ఈ ఘటన బీహార్‌లో జరిగింది.
రోజువారీ కూలి పనులు చేసుకుని బ్రతికే ఓ వ్యక్తికి ఐటీశాఖ పెద్ద షాకిచ్చింది. 14 కోట్ల రూపాయలు పన్ను చెల్లించాలంటూ సదరు కూలీకి నోటీసులు జారీ చేసింది. ఈ ఘటన బీహార్‌లో జరిగింది. రోహ్తాస్‌కు చెందిన మనోజ్ యాదవ్ దినసరి కూలీ. నెలకు 12 నుంచి 15 వేల వరకు సంపాదిస్తుంటాడు. కాగా, డిసెంబర్ 17న అతడి ఇంటికి వచ్చిన ఐటీ అధికారులు అతడికి నోటీసులు జారీ చేశారు. మనోజ్ బ్యాంక్ అకౌంట్ల నుంచి కోట్లాది రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయని, వాటికి పన్ను చెల్లించాల్సి ఉందని, అందువల్లే నోటీసులు ఇచ్చినట్లు ఐటీ అధికారులు తెలిపారు. ఆ నోటీసులు అందుకున్న మనోజ్, అతడి కుటుంబం షాక్‌కు గురైంది. తాను దినసరి కూలీగా పని చేస్తుంటానని, ఆ లావాదేవీలతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నాడు. తకు ఎలాంటి వ్యాపారాలు లేవని వాపోయాడు. కూలి పనుల కోసం హర్యానా, ఢిల్లీ వెళ్లినప్పుడు అక్కడి కాంట్రాక్టర్లు కూలీల నుంచి ఆధార్, పాన్ కార్డులను తీసుకుంటూ ఉంటారు. తన ఆధార్ కార్డు, పాన్ కార్డును వాడి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఉంటారని, పన్నులు ఎగ్గొట్టేందుకు వీటిని వాడుతున్నారని మనోజ్ యాదవ్ ఆరోపించాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Tamma Reddy: ‘చిరంజీవికి తోకలెందుకు’ తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్
ఖుషీ రీ-రిలీజ్‌కు ఎదురు దెబ్బ !! ‘నో’ చెప్పిన డిస్ట్రిబ్యూటర్స్ !!