ఈమె టెక్నిక్ చూస్తే.. ప్రతి ఇంట్లో ఆడోళ్లు ఇలానే చేస్తారేమో.. ఐడియాకి సెల్యూట్‌ చెయ్యాల్సిందే

Updated on: Nov 14, 2025 | 11:14 AM

గ్యాస్ సిలిండర్లకు ప్రత్యామ్నాయంగా, ఓ గ్రామీణ మహిళ అద్భుతమైన 4-బర్నర్ల మట్టి పొయ్యిని రూపొందించింది. ఇటుకలు, మట్టి, వెదురుకర్రలతో తక్కువ ఖర్చుతో తయారైన ఈ జుగాడ్ ఆవిష్కరణ నెట్టింట వైరల్‌గా మారింది. మధ్యలో పొగ కోసం గొట్టం, నాలుగు పాత్రలు ఒకేసారి వండే సౌలభ్యం దీని ప్రత్యేకత. ఆమె సృజనాత్మకతకు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తూ, దీన్ని ఇంజనీరింగ్ అద్భుతంగా కొనియాడారు.

జుగాడ్‌లు తయారు చేయడంలో భారతీయులను మించినవారుండరు. మన దేశంలో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సైతం ప్రభుత్వం గ్యాస్‌ పొయ్యిలను అందుబాటులోకి తెచ్చింది. ఉజ్వల పథకం కింద మహిళలకు సబ్సిడీపై గ్యాస్‌ సిలిండర్లు పంపిణీ చేస్తోంది. అయితే ఓ గ్రామీణ మహిళ తనకు గ్యాస్‌ కొనుక్కునే స్తోమతలేకనో, మరో కారణంతోనో కానీ గ్యాస్‌ స్టవ్‌కి బదులుగా కట్టెల పొయ్యినే అద్భుతంగా రూపొందించింది. అది 4 బర్నర్‌ల స్టౌలా ఉంది. ఆమె ఆలోచనకు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో ప్రకారం ఓ గ్రామీణ మహిళ 4-బర్నర్ల స్వదేశీ స్టవ్‌ను తయారు చేసింది. ఇటుకలు, మట్టి, పార, వెదురుకర్రలు, ఇనుపరాడ్‌ను ఉపయోగించి అద్భుతంగా స్టవ్‌ను తయారుచేసింది. మొదట నేలపై నాలుగు బాక్సులు కలిసి ఉన్నట్టుగా గడ్డపారతో తవ్వింది. దానిలో ఓ వరుస ఇటుకలు పేర్చింది. వాటిని కలుపుతూ మట్టితో చక్కగా అలికింది. ఆతర్వాత వాటిపైన ఒక స్టీలు క్యాను ఉంచింది. దాని చుట్టూ వెదరుకర్రలు అమర్చి, కర్రలమీదుగా మట్టితో అలికింది. మధ్యలో ఒక ప్లాస్టిక్‌ గొట్టాన్ని ఉంచింది. నాలుగు వైపుల నాలుగు హోల్స్‌తో పాటు, మధ్యలో ప్లాస్టిక్‌ గొట్టం ఉంచిన దగ్గర ఒక హోల్‌ వచ్చి మొత్తానికి నాలుగు పాత్రలు ఒకేసారి ఉంచి వంట చేసేలా మట్టిపొయ్యి సిద్ధమైంది. మధ్యలోని గొట్టం ద్వారా పొగ పైకి పోయేలా ఏర్పాటు చేసింది. బామ్మగారి స్మార్ట్‌వర్క్‌కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ వీడియోను ఓ యూజర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఈ వీడియోను ఇప్పటికే 54.6 మిలియన్లమంది వీక్షించగా లక్షలమంది లైక్‌ చేశారు. చాలా మంది ఆ మహిళను ప్రశంసిస్తూ, ఇది IIT కంటే మెరుగైన ఇంజనీరింగ్! అని వ్యాఖ్యానించారు, మరికొందరు, నగరంలో, మనం మైక్రోవేవ్ కోసం పోరాడుతాము, ఇదిగో మట్టి స్టవ్! ఆమె జుగాడ్ ఆవిష్కరణకు ఆస్కార్ ఇవ్వాలి అని వ్యాఖ్యానించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సూట్‌కేసులో నుంచి వింత శబ్దాలు.. ఓపెన్‌ చేసి చూడగా షాక్‌

వామ్మో.. ఒక్కపీత ఖరీదు నాలుగు వేలా ??

ఇది తల్లి ప్రేమ మాత్రమే కాదు.. అంతకు మించి!