వరుసగా రెండో ఏడాది కూడా అమర్‌నాథ్ యాత్రకు బ్రేక్..కరోనా కారణం గా ఈ ఏడాది కూడా అమర్‌నాథ్ యాత్ర రద్దు:Amarnath Yatra 2021 video.
Amarnath Yatra Cancelled: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభించి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఈ క్రమంలో థర్డ్ వేవ్ ప్రమాదం కూడా ముందు ముందు పొంచిఉందని పలు అధ్యయానాలు హెచ్చరిస్తున్నాయి. దీంతో భక్తి శ్రద్ధలతో యాత్రికులు చేపట్టే
Amarnath Yatra Cancelled: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభించి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఈ క్రమంలో థర్డ్ వేవ్ ప్రమాదం కూడా ముందు ముందు పొంచిఉందని పలు అధ్యయానాలు హెచ్చరిస్తున్నాయి. దీంతో భక్తి శ్రద్ధలతో యాత్రికులు చేపట్టే అమర్‌నాధ్ యాత్రను వరుసగా రెండో ఏడాది కూడా అధికారులు రద్దు చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సారధ్యంలో సోమవారం జరిగిన అమర్‌నాధ్ ఆలయ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది కూడా అమర్‌నాధ్ యాత్రను రద్దు చేయాలని బోర్డు నిర్ణయం తీసుకుంది.అమర్‌నాథ్ యాత్రను నిలిపివేసినా.. ఆచారాలు, సంప్రదాయాల ప్రకారం అన్ని పూజా క్రతువులు యథావిథిగా జరగనున్నాయి. పవిత్ర పర్వత గుహల్లో కొలువు తీరిన ఆలయంలో నిత్య క్రతువులు నిర్వహిస్తామని ఆలయ బోర్డు సమావేశానంతరం ఎల్జీ మనోజ్ సిన్హా పేర్కొన్నారు. ఆలయ బోర్డు సభ్యులతో చర్చించిన అనంతరం కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది కూడా అమర్‌నాధ్ యాత్రను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
మరిన్ని ఇక్కడ చూడండి:తమిళనాడు ఇంటి పునాది తవ్వకాల్లో బయటపడిన అతి పురాతన శ్రీ వారి భారీ విగ్రహం..:Lord Venkateswara Idol video.
viral video :పేడ పోయిందని పోలీసులను ఆశ్రయించిన బాధితుడు..దొంగ కన్ను పడితే ఏదైనా మాయం వీడియో.