మన్యంలో అరుదైన పక్షులు.. ఎలా కాపాడుతున్నారో తెలుసా ??

|

Aug 18, 2023 | 8:06 PM

మన్యంలో విదేశీ పక్షులు సందడి చేస్తున్నాయి. అల్లూరి మన్యం జిల్లా దేవీపట్నం మండలంలోని ఫజుల్లబాద్ గ్రామంలో విదేశీ పక్షులతో సందడి నెలకొంది. ఏడాదిలో ఒకసారి మాత్రమే ఇక్కడకు వచ్చి గూడు కట్టుకుని పిల్లల్ని పెడుతుంటాయి. మూడు నెలలపాటు ఇక్కడే ఉండి.. తిరిగి పయణమవుతాయి ఈ అరుదైన పక్షులు. ఫజుల్లబాద్ అనే గ్రామంలో ఒక చింత చెట్టుపై స్థావరం ఏర్పర్చుకున్నాయి. అక్కడే మూడు నెలల వరకు ఉండీ మన్యం వాతావరణాన్ని ఆస్వాదిస్తాయి.

మన్యంలో విదేశీ పక్షులు సందడి చేస్తున్నాయి. అల్లూరి మన్యం జిల్లా దేవీపట్నం మండలంలోని ఫజుల్లబాద్ గ్రామంలో విదేశీ పక్షులతో సందడి నెలకొంది. ఏడాదిలో ఒకసారి మాత్రమే ఇక్కడకు వచ్చి గూడు కట్టుకుని పిల్లల్ని పెడుతుంటాయి. మూడు నెలలపాటు ఇక్కడే ఉండి.. తిరిగి పయణమవుతాయి ఈ అరుదైన పక్షులు. ఫజుల్లబాద్ అనే గ్రామంలో ఒక చింత చెట్టుపై స్థావరం ఏర్పర్చుకున్నాయి. అక్కడే మూడు నెలల వరకు ఉండీ మన్యం వాతావరణాన్ని ఆస్వాదిస్తాయి. అవి తినే ప్రదేశం కూడా ఎవరికి తెలియని విధంగా ఉండడం వాటి లక్షణం. ఈ మూడు నెలల కాలంలో వాటిని చూసేందుకు పర్యాటకులు, పక్షి ప్రేమికులు అధిక సంఖ్యలో తరలివస్తుంటారు. వాటితో ఫోటోలు, వీడియోలు తీసుకోవడానికి వస్తారని గ్రామస్తులు చెబుతున్నారు. అయితే విదేశీ పక్షులు వేటగాళ్ల కంటపడకుండా కాపాడుతున్నారు స్థానికులు. వాటి అలనా పాలన సంరక్షణను గ్రామస్థులే చూసుకుంటున్నారు. అంతేకాకుండా వాటిని విదేశీ భాషలో ఇక్కడ నత్త పక్షిగా పిలుస్తామని స్థానికులు చెబుతున్నారు. కాగా అంతరించిపోతున్న పక్షులలో విదేశీ పక్షులను చూసి ఆనందిస్తున్నామంటున్నారు పర్యాటకులు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అమ్మ బాబోయ్..! అరటి పండు కూడానా.. సెంచరీ కొట్టింది

దోమను చంపబోయి ఆస్పత్రిలో పడ్డ వ్యక్తి !!

బ్రతకదు అనుకున్న భార్యకు ప్రాణం పోసిన భర్త

పుష్పాను మరిపించే రియల్ సీన్.. ఆ ఒక్కటి తప్పా.. అంతా సేమ్ టూ సేమ్

స్కూల్ కింద 2వేల బాంబులు.. జస్ట్‌ మిస్.. లేదంటే ??

Follow us on