తల చూస్తే మొసలి..శరీరం చూస్తే చేప.. డేంజరస్ జీవి..

|

Apr 26, 2023 | 8:59 PM

సముద్ర గర్భం ఎన్నో వింతలు విశేషాలతో నిండి ఉంటుంది. ఇందులో ఎన్నోరకాల జీవరాశులు ఉంటాయి. అందులో చేపలు కూడా ఒకటి. మనకు తెలియని ఎన్నో రకాల చేపలు సముద్ర గర్భంలో ఉంటాయి. అప్పుడప్పుడూ అవి బయటకు వచ్చి మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.

సముద్ర గర్భం ఎన్నో వింతలు విశేషాలతో నిండి ఉంటుంది. ఇందులో ఎన్నోరకాల జీవరాశులు ఉంటాయి. అందులో చేపలు కూడా ఒకటి. మనకు తెలియని ఎన్నో రకాల చేపలు సముద్ర గర్భంలో ఉంటాయి. అప్పుడప్పుడూ అవి బయటకు వచ్చి మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌ లోని ఓ పెద్ద చెరువులో అలాంటి జీవి ఒకటి కలకలం రేపింది. దాని తల చూస్తే మొసలిలా ఉంది.. శరీరం చూస్తే చేపలా ఉండటంతో దాన్ని చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. ఏప్రిల్‌ 19న చెరువుకు వెళ్లిన వారిలో ఒకరికి ఈ చేప దొరకింది. ఆ చేప వింతగా అనిపించడంతో స్థానికులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు, మత్స్యశాఖ అధికారులతో సంప్రదించి భోపాల్ చెరువులో దొరికిన చేప పేరు ఎలిగేటర్ గార్ ఫిష్‌గా గుర్తించారు. ఈ ఎలిగేటర్ గార్ చేపలు ఎక్కువగా అమెరికాలో దొరుకుతాయి. మరి ఈ చేప భోపాల్ పెద్ద చెరువులోకి ఎలా వచ్చిందని అధికారులు ఆలోచనలో పడ్డారు. ఈ చేప పెద్ద చెరువు పర్యావరణానికి ప్రమాదమని నిపుణులు భయపడుతున్నారు. అంతే కాదు ఈ చేపలు మనుషులపై దాడిచేస్తాయని చెబుతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పిల్లితో బలవంతంగా కాలిముద్రలు.. కష్టం పగవాడికి కూడా రాకూడదంటున్న నెటిజన్లు

Jr NTR: ఎన్టీఆర్ గ్లోబల్‌ ఆఫర్‌.. రివీల్ చేసిన హాలీవుడ్‌ డైరెక్టర్‌

Ram Charan: జపాన్‌లో దద్దరిల్లేలా చరణ్ తుఫాన్‌ !!

Karthik Varma Dandu: బంపర్ ఆఫర్ పట్టిన విరూపాక్ష డైరెక్టర్‌..

Uppal Sky Walk: ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న ఉప్పల్ స్కైవాక్

 

Published on: Apr 26, 2023 08:59 PM