Alexa Voice: గొంతు మార్చుకోనున్న అలెక్సా.. ఇకపై చనిపోయిన మీ బామ్మ గొంతుతో కూడా..
తాజాగా అమెజాన్ .. అలెక్సా వాయిస్ అసిస్టెంట్‌కు అధునాతన ఫీచర్‌ను జోడించే పనిలో పడింది. మనుషుల వాయిస్‌ను మిమిక్రీ చేసే విధంగా కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు.
తాజాగా అమెజాన్ .. అలెక్సా వాయిస్ అసిస్టెంట్‌కు అధునాతన ఫీచర్‌ను జోడించే పనిలో పడింది. మనుషుల వాయిస్‌ను మిమిక్రీ చేసే విధంగా కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. దీంతో మీకు నచ్చిన వ్యక్తుల గొంతుతో వాయిస్ కమాండ్స్‌ను వినొచ్చు. బతుకున్న వారితో పాటు, చనిపోయిన వారి వాయిస్‌ను కూడా అలెక్సాలో వినొచ్చు. ఇందుకోసం ముందుగా ఎవరి వాయిస్‌లో అయితే కమాండ్స్ రావాలనుకుంటున్నామో వారిని గొంతును రికార్డ్ చేయాలి.ఆ తర్వాత సదరు శాంపిల్ వాయిస్ ఆధారంగా అలెక్సా తర్వాత ఇచ్చే కమాండ్స్‌ను అదే గొంతుతో వినిపిస్తుంది. అమెజాన్ ఇప్పటికే ఈ టెక్నాలజీపై డెమో కూడా నిర్వహించింది. లాస్ వెగాస్‌లో జరిగిన గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ కాన్ఫరెన్స్‌లో ఈ డెమోను నిర్వహించారు. మరికొన్ని రోజుల్లో అచ్చంగా మనుషుల్లా మాట్లాడే అలెక్సా అందుబాటులోకి రానుందన్నమాట.అమెజాన్ అలెక్సా, గూగుల్ హోమ్, అమెజాన్ ఎకో వంటి వాయిస్ అసిస్టెంట్‌లు ప్రస్తుతం సందడి చేస్తున్నాయి. వార్తల నుంచి వాతావరణ సమాచారం వరకు ఇలా ప్రతీ విషయాన్ని యూజర్లకు వినిపిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ AI, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ IOT సాంకేతికతల ఆధారంగా రూపొందినవే ఈ వాయిస్ అసిస్టెంట్‌లు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Collector-student: కలెక్టరమ్మకూ తప్పని తిప్పలు.. క్లాస్ రూమ్‌లోకి వెళ్లనని తనయుడు మారం..