గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌.!

|

Nov 05, 2024 | 11:37 AM

ప్రతి నెల ప్రారంభంలో గ్యాస్ సిలిండర్ నుండి ఆధార్ కార్డ్, క్రెడిట్ కార్డ్, టెలికాం వరకు వివిధ మార్పులు అవుతుంటాయి. దీని ప్రకారం, అక్టోబర్ ప్రారంభంలో కూడా అనేక మార్పులు జరిగాయి. ఇప్పుడు నవంబర్‌ నెల ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ ధరలు, ఆధార్ కార్డు, క్రెడిట్ కార్డ్, టెలికమ్యూనికేషన్స్ తదితర అంశాల్లో ఏం మార్పులు జరగబోతున్నాయో ఓ సారి చూద్దాం.

ప్రతి నెల ప్రారంభంలో చమురు కంపెనీలు ఎల్‌ఫీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను సవరిస్తాయి. దీని ప్రకారం నవంబర్ 1 నుంచి గ్యాస్ సిలిండర్ ధరలో మార్పు ఉండబోతున్నట్లు సమాచారం. గృహావసరాల గ్యాస్ సిలిండర్ల ధరలు గత కొన్ని నెలలుగా యథాతథంగా ఉండడం గమనార్హం. నవంబర్ 1 నుంచి ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను మాత్రమే కాకుండా సీఎన్‌జీ, పీఎన్‌జీ ధరలను కూడా చమురు కంపెనీలు మార్చబోతున్నట్లు సమాచారం. గత కొన్ని నెలలుగా CNG సహా ATF ధరలు తగ్గించాయి. దీనికి ప్రధాన కారణంగా పండుగ సీజన్‌గా భావించారు. ఈ పరిస్థితిలో నవంబర్ 1 నుంచి వీటి ధరల్లో మార్పు రావచ్చని భావిస్తున్నారు.

ఎస్‌బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ నిబంధనలలో నవంబర్ నుండి కొత్త మార్పులను తీసుకురావాలని యోచిస్తోంది. దీని ప్రకారం.. నవంబర్ 1 నుండి అసురక్షిత క్రెడిట్ కార్డ్‌లకు నెలవారీ ఫైనాన్స్ ఛార్జీ 3.75 శాతం వసూలు చేస్తుంది. అంతే కాకుండా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి విద్యుత్, గ్యాస్ వంటి యుటిలిటీల కోసం మీరు రూ.50,000 కంటే ఎక్కువ చెల్లిస్తే 1శాతం రుసుము వసూలు చేయనున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.