Rahul Gandhi: రాహుల్‌గాంధీ అనే నేను.. ఎన్నికల వేళ డీప్‌ ఫేక్‌ వీడియో సంచలనం.

|

May 01, 2024 | 8:31 PM

ఏఐ టెక్నాలజీతో రూపొందుతున్న డీప్‌ఫేక్ వీడియోలు, ఆడియోలు ఇటీవల కలకలం సృష్టిస్తున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ కి చెందిన ఆడియో క్లిప్ ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆయన దేశ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేస్తున్నట్టు అందులో వినిపిస్తోంది. ఆ వాయిస్‌కు తగ్గట్టుగా మ్యూజిక్, ఢిల్లీలోని ఎర్రకోట ఫొటోలను జత చేసి.. కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారులు దానిని షేర్ చేశారు. ఆ రోజు త్వరలో రానుంది. జూన్‌ 4న రాహుల్ ప్రధాని అవుతారు అని క్యాప్షన్‌ జోడించారు.

ఏఐ టెక్నాలజీతో రూపొందుతున్న డీప్‌ఫేక్ వీడియోలు, ఆడియోలు ఇటీవల కలకలం సృష్టిస్తున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ కి చెందిన ఆడియో క్లిప్ ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆయన దేశ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేస్తున్నట్టు అందులో వినిపిస్తోంది. ఆ వాయిస్‌కు తగ్గట్టుగా మ్యూజిక్, ఢిల్లీలోని ఎర్రకోట ఫొటోలను జత చేసి.. కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారులు దానిని షేర్ చేశారు. ఆ రోజు త్వరలో రానుంది. జూన్‌ 4న రాహుల్ ప్రధాని అవుతారు అని క్యాప్షన్‌ జోడించారు. సార్వత్రిక ఎన్నికల ఓటింగ్ జరుగుతోన్న సమయంలో ఆ ఆడియో నెట్టింట్లో చక్కర్లు కొట్టడం గమనార్హం. కొన్ని డిటెక్షన్‌ టూల్స్ దానిని ఏఐ వాయిస్ క్లోన్‌ అని నిర్ధారించాయి.

మొత్తం ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఇటీవల కొందరు ప్రముఖ నటులు ఫలానా పార్టీల తరఫున ప్రచారం చేస్తున్నట్లుగా వీడియోలు వెలుగులోకి వచ్చాయి. తర్వాత అవి నకిలీవని బయటపడ్డాయి. వాటి కట్టడికి ఓ వైపు కేంద్రం, మరోవైపు సామాజిక మాధ్యమ సంస్థలు చర్యలు చేపడుతున్నా.. నకిలీల బెడద తప్పట్లేదు. ఇక ఎన్నికల సమయంలో ఇలాంటివి మరింత ప్రమాదకర పరిస్థితులకు దారితీసే అవకాశముందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన వెంటనే ఏఐ నియంత్రణకు చట్టం తీసుకొచ్చేలా చర్యలు ప్రారంభిస్తామని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ అన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.