శవంపై కూర్చొని అఘోరా పూజలు.. తమిళనాడులో కలకలం సృష్టించిన ఘటన
ఆత్మహత్య చేసుకున్న స్నేహితుడి శవంపై కూర్చుని పూజలు, ధ్యానం చేసిన సంఘటన కలకలం సృష్టించింది. తమిళనాడులో జరిగిన ఈ ఘటన ఒళ్లు గగుర్పాటుకు గురి చేస్తోంది. కోయంబత్తూరు జిల్లా సూలూరు సమీపం కురుంబపాళయంకు చెందిన అంబులెన్స్ డ్రైవర్ మణికంఠన్..
ఆత్మహత్య చేసుకున్న స్నేహితుడి శవంపై కూర్చుని పూజలు, ధ్యానం చేసిన సంఘటన కలకలం సృష్టించింది. తమిళనాడులో జరిగిన ఈ ఘటన ఒళ్లు గగుర్పాటుకు గురి చేస్తోంది. కోయంబత్తూరు జిల్లా సూలూరు సమీపం కురుంబపాళయంకు చెందిన అంబులెన్స్ డ్రైవర్ మణికంఠన్.. కుటుంబ కలహాలతో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబీకులు మణికంఠన్ మృతదేహాన్ని సూలూరుకు తీసుకొచ్చి ఆదివారం అంత్యక్రియలు జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ విషయం తెలుసుకున్న మణికంఠన్ స్నేహితుడైన తిరుచ్చికి చెందిన అఘోరా మణికందన్ తన అనుచరులను వెంటబెట్టుకుని సూలూరుకు చేరుకున్నాడు. మణికంఠన్ మృతదేహాన్ని శ్మశానికి ఊరేగింపుగా తీసుకెళ్లాక, అక్కడ తన స్నేహితుడి ఆత్మశాంతి కోసం ప్రత్యేక పూజ చేయాలని అఘోరా తెలిపాడు. కుటుంబీకులు అందుకు సమ్మతించగానే అఘోరా మణికంఠన్ మృతదేహంపై పద్మాసనం వేసుకుని ధ్యానం చేసి, మంత్రాలు పఠిస్తూ ప్రత్యేక పూజలు చేశాడు. ఆ తర్వాత మణికంఠన్‌కు కుటుంబీకులు దహనక్రియలు పూర్తి చేశారు. మృతదేహంపై అఘోరా పూజ చేసిన ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మృతుడి బంధువుల అంగీకారంతో ఈ కర్మలు నిర్వహించినట్లు స్థానిక అధికారులు తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Chiranjeevi: నాకు క్యాన్సర్ రాలేదు.. తప్పుగా అర్థం చేసుకున్నారు..
Adipurush: 500కోట్ల పెట్టుబడి వచ్చేసింది.. దిమ్మతిరిగేలా చేస్తున్న ఆదిపురుష్ కలెక్షన్స్
Thaman: అమెరికాలో తమన్ ఓవర్ యాక్షన్.. NATS సీరియస్
Guntur Karam: హాలీవుడ్‌ను తాకిన మహేష్ గుంటూరు కారం
Samantha: సమంత మయోసైటిస్ వ్యాధి.. తగ్గిందా? లేదా?