Viral: 35 ఏళ్ల తరువాత తల్లీ, కొడుకులను కలిపిన వరదలు.. వీడియో వైరల్.

|

Aug 06, 2023 | 9:19 AM

జగజీత్ సింగ్ పటియాలాలోని బోహరర్ పూర్ గ్రామంలో వరద బాధితులను ఆదుకునేందుకు వచ్చాడు. అక్కడ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాడు. ఈ కార్యక్రమాల్లోనే అతని తల్లి హర్జీత్ కౌర్ ను కలుసుకున్నాడు. సుమారు రెండేళ్ళ వయసున్నప్పుడు తల్లి నుంచి విడిపోయిన జగజీత్ సింగ్ మళ్ళీ 35 ఏళ్ళ తర్వాత తల్లిని చేరాడు. జగజీత్ కు 6 నెలల వయసున్నప్పుడు అతని తండ్రి చనిపోయాడు.

వరదల వల్ల నష్టపోతారనే మనందరికీ తెలుసు. వరదలు కారణంగా నివాసాలు, ఆప్తులను పోగొట్టుకుంటారు. కానీ అవే వరదలు విడిపోయిన వారిని కలుపుతాయని ఈ ఘటనద్వారా తెలుస్తోంది. అవును వరదలు ఆ తల్లీకొడుకులను కలిపాయి. 35 ఏళ్ళ క్రితం దూరమైన కొడుకును తల్లి ఒడికి చేర్చాయి. వరదలు తెచ్చిన ఈ ఆనందాలకు తల్లీకొడుకుల ఆనందం వరదలా ఉప్పొంగుతోంది. జగజీత్ సింగ్ పటియాలాలోని బోహరర్ పూర్ గ్రామంలో వరద బాధితులను ఆదుకునేందుకు వచ్చాడు. అక్కడ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాడు. ఈ కార్యక్రమాల్లోనే అతని తల్లి హర్జీత్ కౌర్ ను కలుసుకున్నాడు. సుమారు రెండేళ్ళ వయసున్నప్పుడు తల్లి నుంచి విడిపోయిన జగజీత్ సింగ్ మళ్ళీ 35 ఏళ్ళ తర్వాత తల్లిని చేరాడు. జగజీత్ కు 6 నెలల వయసున్నప్పుడు అతని తండ్రి చనిపోయాడు. తర్వాత అతని తల్లి రెండో పెళ్ళి చేసుకుంది. మరో రెండేళ్ళకు జగజీత్ ను అతని తాత, నాయన్నమ్మలు వారుంటున్న ప్రాంతానికి తీసుకెళ్ళిపోయారు. అప్పటి నుంచి వాళ్ళు జగజీత్ ను అతని తల్లితో కలవకుండా చేశారు. అతను ఎక్కుడున్నాడో కూడా తల్లికి చెప్పలేదు. తల్లిదండ్రులు చనిపోయారని జగజీత్‌కు చెప్పారు. తన తల్లి బతికుందనే విషయమే తనకు తెలియదని అంటున్నాడు జగజీత్ సింగ్. పంజాబ్ లోని పటియాలాలోని ప్రాంతాలను వరద ముంచెత్తింది. జూలై 19న పటియాలాలో ఉన్నాను. అక్కడ జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్నాను. అప్పుడే జగజీత్‌ అత్త తనకు ఫోన్‌ చేసి, అమ్మమ్మ, తాతయ్య బోహర్ పూర్ గ్రామంలో ఉన్నారని చెప్పడంతో తాను వాళ్ళను కలుసుకున్నానని, అలా మా అమ్మ హర్ జీత్ కౌర్ గురించి తెలిసిందని చెప్పాడు. తాను తనకు మొదటి భర్త వల్ల కలిగిన కుమారుడిని అన్న విషయమూ తనకు అప్పుడే తెలిసిందని, ఇన్నేళ్ళు తల్లి ఉండీ లేనట్టు బ్రతికానని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటికైనా భగవంతుడు తనను తన తల్లి దగ్గరకు చేర్చడం చాలా ఆనందంగా ఉంది అంటున్నాడు. మా అమ్మమ్మ, నానమ్మ వాళ్ళ కుటుంబాల మధ్య మనస్పర్ధలు కారణంగానే తాను ఇన్నేళ్ళు తల్లికి దూరంగా ఉండవలసి వచ్చిందని వివరించాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...