Kurnool: వ్యవసాయ అధికారి కార్యాలయంలో వింత శబ్ధాలు.. ఏంటా అని చెక్ చేయగా
ఆదోని మండలం వ్యవసాయ కార్యాలయంలోనికి దాదాపు 7 అడుగుల జెర్రీ పోతు ఎలా వచ్చిందో ఉద్యోగులు ఆలోచనలో పడ్డారు. ఆఫీసులోకి దూరిన పాము దాదాపు అరగంట సేపు ఎక్కడ నక్కిందో కనిపించలేదు. స్నేక్ క్యాచర్ గోపిని పిలిపించి ఆ పామును వెతికించారు. ఎట్టకేలకు ఆఫీసులో మూలలో పాము ఉండడం గమనించి చాకచక్కంగా పాముని పట్టుకొని బయటికి తీసుకువచ్చి చూడగా దాదాపు 6 అడుగుల నుంచి ఏడు అడుగుల వరకు పొడవుంది ఆ పాము.
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ సమీపంలో ఉన్న ఆదోని మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో ఆకస్మాత్తుగా ఓ పాము బుసలు కొడుతూ ఉద్యోగులకు కనిపించింది. దీంతో ఒక్కసారిగా ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు. కార్యాలయం నుంచి పరుగులు తీశారు. అసలు రద్దీగా ఉండే ప్రాంతంలో ఉన్న ఆదోని మండలం వ్యవసాయ కార్యాలయంలోనికి దాదాపు 7 అడుగుల జెర్రీ పోతు ఎలా వచ్చిందో ఉద్యోగులు ఆలోచనలో పడ్డారు. ఆఫీసులోకి దూరిన పాము దాదాపు అరగంట సేపు ఎక్కడ నక్కిందో కనిపించలేదు. స్నేక్ క్యాచర్ గోపిని పిలిపించి ఆ పామును వెతికించారు. ఎట్టకేలకు ఆఫీసులో మూలలో పాము ఉండడం గమనించి చాకచక్కంగా పాముని పట్టుకొని బయటికి తీసుకువచ్చి చూడగా దాదాపు 6 అడుగుల నుంచి ఏడు అడుగుల వరకు పొడవుంది ఆ పాము. స్నేక్ క్యాచర్ గోపి దాన్ని ఓ కవర్లో బంధించి ఆదోని పట్టణ శివారులలోని కొండ ప్రాంతంలో వదిలేశాడు. పాముని తీసుకుపోవడంతో అధికారులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

