2 నెలలగా హడలెత్తించిన మొసలి చివరికి పట్టుబడింది !!
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పెద్దకాల్వలో తిరుగుతూ జనాలను హడలెత్తించిన మొసలి ఎట్టకేలకు చిక్కింది. ఆత్రేయపురం-అమలాపురం ప్రధానకాల్వలో రెండు నెలల క్రితం బొబ్బర్లంక వద్ద కనిపించి స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. స్థానిక రైతులు తమ పశువులకు నీళ్లు తాగేందుకు వాటిని కాల్వలోకి వదులుతారు. ఇక ఎందరో ఈ కాల్వలో ఈత కొడతారు. కార్తీక మాసంలోనూ, అయప్ప భక్తులు ఈ కాల్వలోనే పుణ్యస్నానాలు చేస్తారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పెద్దకాల్వలో తిరుగుతూ జనాలను హడలెత్తించిన మొసలి ఎట్టకేలకు చిక్కింది. ఆత్రేయపురం-అమలాపురం ప్రధానకాల్వలో రెండు నెలల క్రితం బొబ్బర్లంక వద్ద కనిపించి స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. స్థానిక రైతులు తమ పశువులకు నీళ్లు తాగేందుకు వాటిని కాల్వలోకి వదులుతారు. ఇక ఎందరో ఈ కాల్వలో ఈత కొడతారు. కార్తీక మాసంలోనూ, అయప్ప భక్తులు ఈ కాల్వలోనే పుణ్యస్నానాలు చేస్తారు. ఈక్రమంలో కాల్వలో మొసలి సంచారం ఇటు భక్తులను, అటు స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. మొసలిని పట్టుకునేందుకు అటవీశాఖ, మున్సిపల్ అధికారులు ఎంతగానో ప్రయత్నించారు. మొసలి సంచారం నేపధ్యంలో కాల్వలోకి ఎవరినీ దిగవద్దని, పశువులను వదలవద్దని హెచ్చరించారు. అప్పటినుంచి మొసలిని బంధించేందుకు చర్యలు కొనసాగిస్తూనే ఉన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రభుత్వాసుపత్రిలో తన భార్యకు డెలివరీ చేయించిన కలెక్టర్
చిన్నారి విద్యార్థికి టీచర్ అదిరిపోయే సర్‌ప్రైజ్.. ఏం చేసిందంటే ??
సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించిన కమల్ హాసన్
పెట్ డాగ్ వ్యాపారంలో లాభాలు ఎన్ని కోట్లో తెలుసా ??
సాలీడు కాటుతో అలర్జీతో ముఖం ఉబ్బిపోయి గాయం నల్లగా మారిన వైనం..