Parrot missing: నన్ను పట్టిచ్చినవారికి భారీ పారితోషికం.. పట్టుకోండి చూద్దాం.. చిలక పలుకులు వైరల్..
కుటుంబ సభ్యులెవరైనా కనిపించకుండా పోతే.. ఆ బాధ వర్ణణాతీతం. కొందరు ఇంట్లో పెంచుకునే పెంపుడు జంతువులు, పక్షులను కూడా తమ కుటుంబ సభ్యుల్లా భావిస్తారు.
కుటుంబ సభ్యులెవరైనా కనిపించకుండా పోతే.. ఆ బాధ వర్ణణాతీతం. కొందరు ఇంట్లో పెంచుకునే పెంపుడు జంతువులు, పక్షులను కూడా తమ కుటుంబ సభ్యుల్లా భావిస్తారు. వాటితో ఎంతో అనుబంధాన్ని పెంచుకుంటారు. అవి కనిపించకుండాపోతే తల్లడిల్లిపోతారు. తాజాగా అలాంటి ఘటనే జరిగింది ఖమ్మం జిల్లాలో.. వివరాల్లోకి వెళ్తే…ఖమ్మం జిల్లాకు చెందిన నరేష్ అనే వ్యక్తి మూడేళ్లుగా ఆఫ్రికా జాతికి చెందిన ఓ గ్రే కలర్ చిలుకను ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నారు. ఆ కుటుంబ సభ్యులంతా దానిని ప్రాణప్రదంగా చూసుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ రోజు ఆ చిలుక ఎటో వెళ్లిపోయింది. కనిపించకుండా పోయిన ఆ చిలుక కోసం ఆ కుటుంబమంతా తీవ్ర మనోవేదనకు గురైంది. నిద్రాహారాలు సైతం మాని ఆ చిలుక కోసం వెతుకుతున్నారు. ఈ చిలుక ఆచూకీ తెలిపినవారికి భారీ పారితోషికం కూడా ఇస్తామని ప్రకటించారు. అందుకు 9000432435, 8790717947 ఫోన్ నెంబర్లకు తెలపాలని కోరారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్.. సూపర్ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..
Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..
