బాలీవుడ్ నటి సనా ఖాన్ కల్యాణ్ రామ్ కత్తి సినిమాలో హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులనూ అలరించింది. ఆ తరువాత సినిమాలు మానేసిన సనా.. ఆధ్యాత్మిక మార్గంలో పయనించింది. ముఫ్తీ అనాస్ సయూద్ అనే మతప్రబోధకుడిని పెళ్లాడి లైఫ్లో సెటిలైంది. ప్రస్తుతం గర్భంతో ఉన్న ఆమె ఇటీవల తన భర్తతో కలిసి ముంబైలో బాబా సిద్దీకీ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు హాజరైంది. ఈ సమయంలో సనా చేయి పట్టుకుని ఆమె భర్త బరబరా లాక్కూంటూ గదిలోకి తీసుకెళ్లడం కెమెరా కంట పడటంతో ఈ ఘటన తాలూకు వీడియో నెట్టింట వైరల్గా మారింది. నడవలేక వగరుస్తూ ఆపసోపాలు పడుతున్న సనా ఖాన్ను ఆమె భర్త బలవంతంగా లాక్కెళ్లుతున్నట్టు వీడియోలో కనిపించడంతో నెటిజన్లు అవాక్కవుతున్నారు. సనా భర్తపై విమర్శలు గుప్పించారు. దీంతో.. స్వయంగా సనా రంగంలోకి దిగాల్సి వచ్చింది. తానే తొందరగా వెళ్లిపోదామని భర్తను కంగారు పెట్టానంటూ ఆమె వివరణ ఇచ్చుకుంది. ‘‘ఎవరికీ ఇబ్బంది కలగకుండా అక్కడి నుంచి వెళ్లిపోవాలని నేనే చెప్పాను. కాస్తంత చల్లని ప్రదేశంలో కూర్చుంటే సేదతీరొచ్చనే ఉద్దేశంతో నా భర్త వేగంగా ముందుకెళ్లిపోయారు’’ అని ఆమె వివరించింది. వీడియో చూసి తాను కూడా కాస్తంత షాకయ్యానని చెప్పుకొచ్చింది. మరిన్ని వీడియోస్ కోసం: Videos Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్.. Allu Arjun Vibrant Look: ఉగ్రగంగమ్మగా పుష్పరాజ్.. సీన్ దద్దరిల్లాలే.. నెట్టింట ఊచకోత కోస్తున్న బన్నీ వీడియో.. Pushpa-2 Video: పుష్ప అడుగుపడితే.. పులి కూడా కుక్క అయిపోవాలే..! సోషల్ మీడియాను రఫ్పాడిస్తున్న పుష్ప..