Divya Vani: అలనాటి హీరోయిన్‌.. నేటి టీడీపీ ఫైర్‌ బ్రాండ్.. బుల్లెట్‌ బండి పాటకు ఎలా స్టెప్పులేశారో చూశారా.?

|

Nov 13, 2021 | 5:57 PM

Divya Vani: ఇప్పుడు ఎక్కడ చూసినా.? ఎక్కడ విన్నా.? బుల్లెట్‌ బండి పాట మోర్మోగుతోంది. కరీంనగర్‌కు చెందిన ఓ నవ వధువు పెళ్లి తర్వాత జరిగిన బరాత్‌లో ఈ పాటకు డ్యాన్స్‌ చేయడం, ఆ డ్యాన్స్‌ కాస్త సోషల్‌ మీడియాలో..

Divya Vani: అలనాటి హీరోయిన్‌.. నేటి టీడీపీ ఫైర్‌ బ్రాండ్.. బుల్లెట్‌ బండి పాటకు ఎలా స్టెప్పులేశారో చూశారా.?
Divya Vani Dance
Follow us on

Divya Vani: ఇప్పుడు ఎక్కడ చూసినా.? ఎక్కడ విన్నా.? బుల్లెట్‌ బండి పాట మోర్మోగుతోంది. కరీంనగర్‌కు చెందిన ఓ నవ వధువు పెళ్లి తర్వాత జరిగిన బరాత్‌లో ఈ పాటకు డ్యాన్స్‌ చేయడం, ఆ డ్యాన్స్‌ కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో పెద్ద చర్చకు దారి తీసింది. దీంతో అప్పటి నుంచి ఎవరి పెళ్లి జరిగినా బుల్లెట్‌ బండి పాట కచ్చితంగా ఉండాల్సిందే అన్నంతలా మారిపోయింది. అయితే ఈ పాట సామాన్యులతో పాటు సెలబ్రిటీలను సైతం ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే పలువురు సినీ, రాజకీయ నాయకులు కూడా ఈ పాటకు స్టెప్పుల్లేస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా టీడీపీ అధికారిక ప్రతినిధి, అలనాటి అందాల తార దివ్యవాణి కూడా బుల్లెట్‌ బండి పాటకు స్టెప్పులేశారు. ప్రత్యర్థి పార్టీ నాయకులను తన మాటలతో ముప్పుతిప్పలు పెట్టే దివ్య వాణి బుల్లెట్టు బండి పాటకు స్టెప్పులేసి అందరినీ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం దివ్య వాణి డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఏదో కార్యక్రమానికి హాజరైన అనంతరం దివ్య వాణి సన్నిహితుల నడుమ ఈ పాటకు స్టెప్పులేశారు. దీంతో అక్కడున్న కొందరు ఆమె డ్యాన్స్‌ను వీడియో తీశారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం టీడీపీ అధికార ప్రతినిధిగా ఉన్న దివ్య వాణి ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో అద్భుతమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా పెళ్లి పుస్తకం చిత్రంతో ఆమె ఎంతో మంది కి చేరువయ్యారు. అనంతరం పలు సీరియళ్లలో కూడా నటించిన ఆమె ఇప్పుడు రాజకీయాల్లో క్రీయాశీలకంగా ఉన్నారు.

Also Read: CA Exams 2021: డిసెంబర్‌ 5 నుంచి CA పరీక్షల నిర్వహణ.. ICAI మార్గదర్శకాలు తప్పక తెలుసుకోండి..

Amit Shah: గుజరాతీ కంటే ఆ భాష అంటేనే ఎక్కువ ప్రేమ.. సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంత్రి అమిత్ షా!

Chicken Price: చికెన్‌ లవర్స్‌కి గుడ్‌ న్యూస్‌.. భారీగా తగ్గిన ధరలు.. నాలుగు నెలల్లో ఇదే అత్యల్పం..