Aadhar Data: కోవిడ్ వ్యాక్సీన్‌కి ఆధార్ ఇచ్చారా..? అయితే మీ డేటా డౌటే.? 80 కోట్ల ఆధార్ డేటా లీక్

|

Nov 01, 2023 | 6:49 PM

టెక్నాలజీ పెరుగుతున్న ప్రస్తుతకాలంలో సైబర్ నేరగాళ్ల ఆగడాలు పెట్రేగిపోతున్నాయి. ఇప్పటికి వరకు ప్రభుత్వ వెబ్‌సైట్లను హ్యాక్ చేసిన సైబర్ క్రిమినల్స్ తాజాగా ఇండియన్స్ ఆధార్ వివరాలను హ్యాక్ చేశారు. ఏకంగా 81.5 కోట్ల భారతీయుల వివరాలు డార్క్ వెబ్‌లో లీక్ అయినట్లు అమెరికాకు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ 'రిసెక్యూరిటీ' వెల్లడించింది. :లీకైన డేటాలో పేర్లు, వయసు, ఆధార్ నెంబర్, పాస్‌పోర్ట్ సమాచారం, మొబైల్ నెంబర్స్ వంటివి ఉన్నట్లు సమాచారం.

టెక్నాలజీ పెరుగుతున్న ప్రస్తుతకాలంలో సైబర్ నేరగాళ్ల ఆగడాలు పెట్రేగిపోతున్నాయి. ఇప్పటికి వరకు ప్రభుత్వ వెబ్‌సైట్లను హ్యాక్ చేసిన సైబర్ క్రిమినల్స్ తాజాగా ఇండియన్స్ ఆధార్ వివరాలను హ్యాక్ చేశారు. ఏకంగా 81.5 కోట్ల భారతీయుల వివరాలు డార్క్ వెబ్‌లో లీక్ అయినట్లు అమెరికాకు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ ‘రిసెక్యూరిటీ’ వెల్లడించింది. :లీకైన డేటాలో పేర్లు, వయసు, ఆధార్ నెంబర్, పాస్‌పోర్ట్ సమాచారం, మొబైల్ నెంబర్స్ వంటివి ఉన్నట్లు సమాచారం. అక్టోబర్ 9న pwn0001 పేరుతో ఒక హ్యాకర్ దాదాపు 815 మిలియన్స్ (8.15 కోట్లు) భారతీయుల ఆధార్, పాస్‌పోర్ట్ రికార్డ్స్ యాక్సెస్ పొందినట్లు రిసెక్యూరిటీ పేర్కొంది. ఈ డేటా వివరాలను 80000 డాలర్లకు అనగా రూ. 66.60 లక్షలు) విక్రయించడానికి సిద్దమైనట్లు సమాచారం. లీకైన వివరాలు ICMR వద్ద ఉన్న భారతీయులకు సంబంధించినవి తెలుస్తోంది. ఈ విషయంపై CBI దర్యాప్తు చేస్తోంది. డేటా చోరీ జరగటం దేశంలో ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. జూన్‌లో కొవిన్ వెబ్‌సైట్‌ నుంచి వ్యాక్సినేషన్ చేసుకున్న లక్షలమంది భారతీయుల సమాచారం లీకయింది. అంతకు ముందు ఢిల్లీ ఎయిమ్స్‌లో ఔట్‌పేషెంట్ విభాగంలోని రోగుల రికార్డులను హ్యాక్ చేశారు. భారతీయులకు ఆధార్ చాలా ముఖ్యమైన డాక్యుమెంట్. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డు వంటి వాటి కోసం ఆధార్ కార్డు తప్పనిసరి అయిపోయింది. అలాంటి ఈ కార్డు వివరాలు సైబర్ నేరగాళ్ల చేతిలో పడితే బ్యాంకింగ్‌ దోపిడీలు, ట్యాక్స్‌ రిఫండ్‌ మోసాలు, ఇతర ఆర్థిక నేరాలకు పాల్పడే అవకాశం ఉంది. ఈ ఘటనపై ఇప్పటి వరకు భారత ఐటీ మంత్రిత్వ శాఖ స్పందించలేదు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..