Crime: ఫ్రెండ్స్‌తో కలిసి విహారయాత్రకు వెళ్లిన యువతి.. చివరికి షాక్..!
సృష్టిలో స్నేహబంధానికి ఉన్న విలువ, గొప్పతనం అందరికీ తెలిసిందే. ఎలాంటి పరిస్థితిలోనైనా నేనున్నానంటూ అండగా నిలబడేవాడే నిజమైన స్నేహితుడు. కానీ ఇటీవల కాలంలో ఆ స్నేహం కూడా కల్తీ అయిపోయింది. స్నేహం ముసుగులో అరాచకాలకు పాల్పడుతున్నారు.
హనమకొండలోని ఓ డిగ్రీ కళాశాలలకు చెందిన ఆరుగురు స్నేహితులు తమ బైక్‌లపై ములుగు జిల్లాలోని వాజేడు పర్యటనకు వెళ్లారు. అక్కడ వీరందరు చాలా సరదగా గడిపారు. ఆ తర్వాత సాయంత్రం తిరుగు ప్రయాణమయ్యారు. అంతాబాగానే ఉంది అనుకుంటే.. ఓ అమ్మాయిపై మరో అబ్బాయి కన్నేశాడు. వాళ్లు తిరుగు ప్రయాణంలో భాగంగా రింగు రోడ్డు మీదుగా హనుమకొండ జిల్లా కోమటిపల్లికి చేరుకున్నారు. అక్కడ కాసేపు విశ్రాంతి కోసం ఆగారు. వారిలో వరంగల్‌కు చెందిన అమ్మాయిని ఏటూనాగారానికి చెందిన అన్వేష్ అనే అబ్బాయి పనుందని చెప్పి ఆమెను తనతోపాటు రమ్మని పిలిచాడు. ఆ తర్వాత ఆమెను రింగు రోడ్డుకు కాస్త దూరంగా తీసుకెళ్లాడు. కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ సమీపంలో స్నేహితురాలిపై అత్యాచారంకు పాల్పడ్డాడు. ఆ తర్వాత బైక్‌పై పారిపోయాడు. విషయం తెలుసుకున్న మిగతా మిత్రులు షాకయ్యారు. యువతిని తన ఇంటికి తీసుకెళ్లి, తల్లిదండ్రులకు విషయం తెలిపారు. ఆమె తల్లిదండ్రులు సోమవారం నాడు కేయూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితునికోసం గాలింపు చేపట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...