Young woman video: ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర యువతి చేసిన పనికి అంతా షాక్..! వైరల్ అవుతున్న వీడియో..
ఓ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర విచిత్ర సంఘటన జరిగింది. రోడ్డు మీద వేగంగా వాహనాలు దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలో ఓ చోట ట్రాఫిక్ సిగ్నల్ పడింది. ఓ వైపు వాహనాలు నిలిచిపోయాయి. మరోవైపు వాహనాలు వెళ్తున్నాయి.
ఓ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర విచిత్ర సంఘటన జరిగింది. రోడ్డు మీద వేగంగా వాహనాలు దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలో ఓ చోట ట్రాఫిక్ సిగ్నల్ పడింది. ఓ వైపు వాహనాలు నిలిచిపోయాయి. మరోవైపు వాహనాలు వెళ్తున్నాయి. ఈ క్రమంలో ట్రాఫిక్ నిలిచి ఉన్న వైపు ఓ అనాధ బాలుడు కంట్లో ఏదో పడి సరిగా చూడలేక ఇబ్బంది పడుతున్నాడు. అక్కడే ఓ మోటర్ బైక్‌పై నిలిచి ఉన్న మహిళ ఆ బాలుడిని చూసి దగ్గరకు పిలిచి ఆ కుర్రాడి కంట్లో మెల్లగా ఊదింది. దాంతో ఆ కుర్రాడు కంటిబాధనుంచి కొంచెం ఉపశమనం పొందాడు. అంతేకాదు ఆ బాలుడి బుగ్గలను ఆప్యాయంగా నిమిరింది. ఆ తర్వాత ఆ కుర్రాడికి కొంత డబ్బు కూడా ఇచ్చింది. ఆ బాలుడు ఎంతో సంతోషంగా తిరిగి వెళ్తుండగా… మళ్లీ ఆ బాలుడ్ని పిలిచి అతని బుగ్గలను గట్టిగా లాగి.. ఇక వెళ్లు అన్నట్లు చెప్పింది. ఈ అద్భుతమైన వీడియో డాక్టర్ అజయిత తన ట్విట్టర్ ఎకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఇతరుల పట్ల దయకలిగి ఉండటానికి ఎక్కువ ఖర్చు అక్కర్లేదు అంటూ క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది. ఈ వీడియోను మిలియన్ పైగా నెటిజన్లు వీక్షించగా లక్షల్లో లైక్ చేశారు. వీడియో హృదయాన్ని కదిలించిందంటూ రకరకాల కామెంట్లు పెట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Collector-student: కలెక్టరమ్మకూ తప్పని తిప్పలు.. క్లాస్ రూమ్‌లోకి వెళ్లనని తనయుడు మారం..
Husbands: ఈ భార్యలు మాకొద్దు బాబోయ్.. భార్యబాధితులు వింత పూజలు వైరల్ అవుతున్న వీడియో..
అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన భారతీయ రైల్వే
ఉద్యోగం నిలబెట్టుకోవాలంటే..ఈ 5 స్కిల్స్ తప్పనిసరి..!
గ్యాస్ అక్కర్లేదు.. కిరోసిన్, నీటితో నడిచే స్టవ్ వచ్చేసింది
బోను నుంచి తప్పించుకున్న చిరుత.. ఆ తర్వాత సీన్ చూస్తే..
సముద్ర గర్భంలో భారీగా బంగారం, వెండి..వేట మొదలు పెట్టిన చైనా
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!

