Marriage in ICU: తల్లి కోరిక మేరకు ఐసీయూలోనే పెళ్లి.. అంతలోనే ఊహించని పరిణామం.. కంటతడి పెట్టించే ఘటన.
తల్లి కోరిక తీర్చేందుకు ఓ యువతి ఆస్పత్రిలోని ఐసీయూలో వివాహం చేసుకుంది. ఆశ్చర్యకరమైన ఈ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. కొంత కాలంగా ఆనారోగ్యంతో
తల్లి కోరిక తీర్చేందుకు ఓ యువతి ఆస్పత్రిలోని ఐసీయూలో వివాహం చేసుకుంది. ఆశ్చర్యకరమైన ఈ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధపడున్న పూనమ్ కుమారి వేర్మ అనే మహిళ బిహార్‌కు చెందిన ఆశా సింగ్ మోడ్ మెజిస్ట్రేట్ కాలనీ సమీపంలోని ఆర్ష్ ఆసుపత్రిలో అడ్మిట్ అయింది. ఆమె ఆరోగ్యం విషమించడంతో వేర్మ ఎప్పుడైనా చనిపోవచ్చని ఆర్ష్ ఆసుపత్రి వైద్యులు చెప్పారు. దీంతో ఆమె తాను చనిపోవడానికి కొన్ని గంటల ముందు కుటుంబ సభ్యులు, కూతురుకు తన చివరి కోరిక గురించి చెప్పింది. తన కూతురి వివాహం తను బ్రతికుండగానే జరగాలని కోరింది. కాగా చాందిని వేర్మకు ఆల్రెడీ పెళ్లి నిశ్చయమై ముహూర్తం కూడా పెట్టుకున్నారు. పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ముహూర్తానికి ఒక్కరోజుముందు తల్లి తన చివరి కోరిక చెప్పడంతో తల్లి పరిస్థితిని అర్ధం చేసుకున్న చాందిని ఆమె కోరికమేరకు డిసెంబరు 26న ఐసీయూలో ఉన్న తల్లి ఎదుటే సుమిత్ గౌరవ్‌ను వివాహం చేసుకుంది. అమ్మాయి తల్లి పట్టుబట్టడంతో ముందుగా నిశ్చయించిన పెళ్లి తేదీకి ఒకరోజు ముందే ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. అయితే చాందిని పెళ్లయిన రెండు గంటలకే పూనమ్ కుమారి వేర్మ చనిపోయింది. ఈ ఘటన ఆర్ష్ ఆసుపత్రి సిబ్బందిని కూడా కంటతడి పెట్టించింది. ఆ కుటుంబంలో సంతోషంతో పాటు దుఃఖం కూడా ఒకే సారి ప్రవేశించింది. ఐసీయూలో జరిగిన పెళ్లికి సంబంధించిన వీడియోను ఓ యూట్యూటర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా అది ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు చాందినిని ఎంతగానో ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos