Viral: దేశం దాటేందుకు వేషం మార్చ యువకుడి విఫలయత్నం.. చివరికి.?

|

Jun 22, 2024 | 5:41 PM

జుట్టుకు, గడ్డానికి తెల్లరంగు వేసుకొని.. అరవయ్యేళ్ల వృద్ధుడిలా బోల్తాకొట్టించి.. దేశం దాటిపోదామనుకున్న ఓ యువకుడిని సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది అడ్డుకున్నారు. 24 ఏళ్ల గురు సేవక్‌ సింగ్‌ కెనడా వెళ్లేందుకు బుధవారం దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చాడు. అతడి కదలికలపై సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందికి అనుమానం రావడంతో అతన్ని మరింత క్షుణ్ణంగా చెక్‌ చేశారు.

కెనడా వెళ్లేందుకు ఓ యువకుడు ఖతర్నాక్‌ ఐడియా వేశాడు. వేషం మార్చి, పాస్‌పోర్ట్‌ను చూపించి దేశం దాటి పోవాలనుకున్నాడు. కానీ అనుమనాస్పదంగా కనిపించిన అతని ప్రవర్తన పోలీసులకు పట్టించేసింది. జుట్టుకు, గడ్డానికి తెల్లరంగు వేసుకొని.. అరవయ్యేళ్ల వృద్ధుడిలా బోల్తాకొట్టించి.. దేశం దాటిపోదామనుకున్న ఓ యువకుడిని సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది అడ్డుకున్నారు. 24 ఏళ్ల గురు సేవక్‌ సింగ్‌ కెనడా వెళ్లేందుకు బుధవారం దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చాడు. అతడి కదలికలపై సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందికి అనుమానం రావడంతో అతన్ని మరింత క్షుణ్ణంగా చెక్‌ చేశారు. అతని గుర్తింపు కార్డు చూపించాలని కోరగా.. రష్వీందర్‌ సింగ్‌ పేరిట ఉన్న ఓ పాస్‌పోర్టును వారికిచ్చాడు.

అందులో అతని వయస్సు 67 సంవత్సరాలు అని ఉంది. కానీ.. అతడి శరీర తీరు, చర్మం, గొంతు మాత్రం సిబ్బందికి అనుమానం కలిగించడంతో తమదైనశైలిలో విచారించారు. దాంతో అసలు విషయం బయటపడింది. ముసలివాడిలా కనిపించేందుకు జుట్టుకు, గడ్డానికి తెల్ల రంగు వేసుకోవడంతోపాటు కళ్లజోడు కూడా పెట్టుకున్నట్లు తెలిసింది. ఆ తర్వాత తన అసలు పాస్‌పోర్టు ఫొటోను అతడి ఫోన్‌లో గుర్తించారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం వస్తువులతో సహా నిందితుడిని ఢిల్లీ పోలీసులకు అప్పగించినట్లు సీఐఎస్‌ఎఫ్‌ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.