కలిసి ఉంటూనే.. కాలయముడయ్యాడు.! స్నేహితుడిని కత్తితో పొడిచి చంపిన యువకుడు

|

Jul 30, 2024 | 8:20 PM

హైదరాబాద్‌లోని ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో దారుణం జరిగింది. బార్బర్ షాప్‌లో ఉపయోగించే కత్తితో స్నేహితుడిపై దాడిచేసి చంపేశాడు ఓ వ్యక్తి. పోలీసుల కథనం ప్రకారం.. ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేసే వెంకటరమణ, బార్బర్ షాప్‌లో పనిచేసే గణేశ్ కలిసి ఒకే రూములో ఉంటున్నారు. గణేశ్‌కు మద్యం తాగే అలవాటు ఉండడంతో నిత్యం రాత్రి మద్యం తాగి రూముకు వచ్చేవాడు.

హైదరాబాద్‌లోని ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో దారుణం జరిగింది. బార్బర్ షాప్‌లో ఉపయోగించే కత్తితో స్నేహితుడిపై దాడిచేసి చంపేశాడు ఓ వ్యక్తి. పోలీసుల కథనం ప్రకారం.. ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేసే వెంకటరమణ, బార్బర్ షాప్‌లో పనిచేసే గణేశ్ కలిసి ఒకే రూములో ఉంటున్నారు. గణేశ్‌కు మద్యం తాగే అలవాటు ఉండడంతో నిత్యం రాత్రి మద్యం తాగి రూముకు వచ్చేవాడు. దీంతో తనకు నిద్రాభంగమవుతోందని, తాగి రూముకు రావొద్దని గణేశ్‌ను వెంకటరమణ పలుమార్లు హెచ్చరించాడు. అయినప్పటికీ అతడి తీరు మారలేదు.

గత అర్ధరాత్రి మరోమారు తాగి రావడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అది కాస్తా ముదరడంతో కోపంతో ఊగిపోయిన గణేశ్ సెలూన్‌లో ఉపయోగించే కత్తితో వెంకటరమణను విచక్షణ రహితంగా పొడిచాడు. తీవ్రంగా గాయపడిన వెంకటరమణ అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వెంకటరమణది కర్నూలు జిల్లా ఆలమూరని పోలీసులు తెలిపారు. అయితే ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.