Viral Video: మెట్రో ట్రైన్‌లో అందరిముందు బట్టలు విప్పి యువకుడు స్నానం.. బిత్తరపోయిన జనం

Updated on: Apr 17, 2023 | 9:03 AM

సోషల్‌ మీడియాలో పాపులర్‌ అవ్వాలని కొందరు విచక్షణ మరిచి ప్రవర్తిస్తున్నారు. ఇటీవల ఢిల్లీ మెట్రోలో ఓ అమ్మాయి బికినీ లాంటి డ్రెస్ లో అర్థనగ్నంగా కనిపించడం దుమారం రేపింది.

ఈ మధ్య కాలంలో మెట్రో ట్రైన్‌లో రకరకాల షాకింగ్‌ ఘటనలు జరుగుతున్నాయి. సోషల్‌ మీడియాలో పాపులర్‌ అవ్వాలని కొందరు విచక్షణ మరిచి ప్రవర్తిస్తున్నారు. ఇటీవల ఢిల్లీ మెట్రోలో ఓ అమ్మాయి బికినీ లాంటి డ్రెస్ లో అర్థనగ్నంగా కనిపించడం దుమారం రేపింది. ఒంటి మీద బ్రా, మినీ స్కర్ట్ మినహా మరేమీ లేవు. దీంతో ఆ యువతి వీడియో వైరల్ గా మారింది. ఇప్పుడు అంతకుమించి అన్నట్టు మరో వ్యక్తి వ్యవహరించాడు. ఇతగాడు కదులుతున్న మెట్రోలో ఏకంగా స్నానమే చేసేశాడు. తోటి ప్రయాణికులు చూస్తుండగానే.. బట్టలు విప్పి మరీ స్నానం చేశాడు. ఈ షాకింగ్ ఘటన న్యూయార్క్ సిటీ సబ్ వే ట్రైన్ లో జరిగింది. కోచ్ లోని కంపార్ట్ మెంట్ లో అందరితోపాటే ఓ వ్యక్తి కూర్చున్నాడు. రైలు ముందుకు పోతోంది. ఇంతలో సడెన్ గా ఆ వ్యక్తి పైకి లేచాడు. అందరూ చూస్తుండగానే.. తన షూస్, ఫ్యాంటు, షర్ట్‌ అన్నీ విప్పేశాడు. ఆ తర్వాత సూట్ కేస్ లాంటి ట్రాలీ బాగ్ ఓపెన్ చేశాడు. అందులో ఓ వాటర్ బాటిల్ ఉంది. అది ఓపెన్ చేసి అందులోని నీటిని ట్రాలీ బ్యాగ్ లో పోశాడు. ఆ తర్వాత ఓ స్పాంజ్ తీసుకుని నీటిలో ముంచి ఆ నీటిని తన ఒంటి మీద పోసుకున్నాడు. ఆ తర్వాత నురగ వచ్చే క్రీమ్ ని శరీరానికి రాసుకున్నాడు. ఇలా.. తోటి ప్రయాణికుల ముందే.. అతడు స్నానం చేశాడు. ఆ తర్వాత టవల్ తో జాగ్రత్తగా ఒళ్లంతా తుడుచుకున్నాడు. ఆ వ్యక్తి చేసిన పనికి తోటి ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. అతడికి దూరంగా పక్కకు వెళ్లిపోయారు. ఇదంతా అక్కడే ఉన్న మరో వ్యక్తి వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. దాంతో అది వైరల్ గా మారింది. వీడెవడండీ బాబూ అంటూ కొందరు ఆశ్చర్యపోతే, కొందరు మాత్రం ఆ యువకుడి తీరుకు మండిపడుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..

Allu Arjun Vibrant Look: ఉగ్రగంగమ్మగా పుష్పరాజ్‌.. సీన్ దద్దరిల్లాలే.. నెట్టింట ఊచకోత కోస్తున్న బన్నీ వీడియో..

Pushpa-2 Video: పుష్ప అడుగుపడితే.. పులి కూడా కుక్క అయిపోవాలే..! సోషల్ మీడియాను రఫ్పాడిస్తున్న పుష్ప..