Viral Video: మెడలో పాముతో మెట్రో ఎక్కిన యువకుడు.. అయినా పట్టించుకోని జనం.. ఎందుకంటే.?

|

Aug 07, 2023 | 9:44 AM

ఈ వీడియోను చూసిన నెటిజన్లు సదరు యువకుడిపై, ఇంకా అతన్ని మెట్రోలోకి అనుమతించిన అధికారులపై మండిపడుతున్నారు. తోటి ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసే ఇలాంటి చేష్టలు సరికాదని హితవు పలికారు. అతన్ని వెంటనే అదుపులోకి తీసుకుని భారీగా ఫైన్ వేయాలని, అధికారులకు ఫిర్యాదు చేయకుండా కూర్చున్న తోటి ప్రయాణికులు కూడా శిక్షార్హులేనని తమ తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

ఇటీవల మెట్రో రైల్లో చిత్ర విచిత్రమైన సంఘటనలు మనం చూస్తున్నాం. తాజాగా మరో విచిత్ర సంఘటన జరిగింది. దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఓ రేంజ్‌లో మండిపడుతున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి తన పెంపుడు పాముతో మెట్రోలో ప్రయాణం చేస్తున్నాడు. అతని చేతిలో ఏ చిన్నసైలు పామో లేదు, ఏకంగా అనకొండను తలపించే అతిపెద్ద పాము ఉంది. అది అతను తన మెడలో వేసుకొని మెట్రో రైలు ఎక్కాడు. అయితే అదేం పెద్ద విశేషం కాదన్నట్లుగా ఆ మెట్రోలోని తోటి ప్రయాణికులు తమ తమ ఫోనుల్లో నిమగ్నమైపోయారు. ఈ వీడియోను ఓ ఇన్‌స్టా యూజర్‌ తన ఖాతనుంచి పోస్ట్‌ చేశాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు సదరు యువకుడిపై, ఇంకా అతన్ని మెట్రోలోకి అనుమతించిన అధికారులపై మండిపడుతున్నారు. తోటి ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసే ఇలాంటి చేష్టలు సరికాదని హితవు పలికారు. అతన్ని వెంటనే అదుపులోకి తీసుకుని భారీగా ఫైన్ వేయాలని, అధికారులకు ఫిర్యాదు చేయకుండా కూర్చున్న తోటి ప్రయాణికులు కూడా శిక్షార్హులేనని తమ తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇలాంటివాటిని పెంచుకునేవారు తమ ఇంట్లోనే పెట్టుకోవాలి కానీ ఇలా పబ్లిక్‌లోకి తీసుకురాకుడదని సూచిస్తున్నారు. ఈ వీడియోను ఇప్పటికే 10 లక్షలమందికి పైగా వీక్షించారు. 14 వేల మంది లైక్‌ చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...