Bride And Groom: వేదికపైనే రెచ్చిపోయిన వధూవరులు.. హుక్కా తాగుతూ..వరుడికి లిప్ కిస్ ఇచ్చిన యువతి..
మన దేశంలో పెళ్లి వేడుకలకు ప్రత్యేక స్థానముంది. హంగు, ఆర్భాటాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ప్రతి అంశంలోనూ తమ ప్రత్యేకత చాటుకోవాలని చాలామంది భావిస్తారు.
మన దేశంలో పెళ్లి వేడుకలకు ప్రత్యేక స్థానముంది. హంగు, ఆర్భాటాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ప్రతి అంశంలోనూ తమ ప్రత్యేకత చాటుకోవాలని చాలామంది భావిస్తారు. ఇక ఇప్పుడు సోషల్ మీడియా యుగం నడుస్తోంది. లైక్స్, వ్యూస్, షేర్ల కోసం కొందరు వేసే వెర్రివేషాలకు హద్దు లేకుండా పోతోంది. అందుకు ఉదాహరణే ఈ వీడియో. ఓ నూతన జంట వివాహ వేదికపైనే హుక్కా తాగుతూ ముద్దులు పెట్టుకోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదెక్కడ జరిగిందో తెలియదు కానీ నూతన వధూవరులు చేసిన పిచ్చి పనిపై అందరూ మండి పడుతున్నారు.ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోన్న ఈ వీడియోలో అందచూస్తుండగానే వధువు హుక్కా పీల్చుతుంది . ఆతర్వాత వరుడికి లిప్ కిస్ ఇచ్చింది. వరుడి నోట్లో నోరు పెట్టి పొగను ఊదింది. అనంతరం వరుడు మళ్లీ ఆ పొగను బయటకి వదిలాడు. పెళ్లికి వచ్చిన వారిలో ఓ వ్యక్తి దీన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాడు. అంతే ఒక్కసారిగా ఈ వీడియో వైరల్‌గా మారింది. అదే సమయంలో ఆ జంటపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ‘వైరల్ అవ్వడానికి ఇన్ని వెర్రి వేషాలా’, ‘పెళ్లికుండే పవిత్రతను దెబ్బతీస్తున్నారు’ అంటూ నూతన జంటపై నెటిజన్లు మండిపడుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్ ప్రకటన..
