Drugs: బాబోయ్‌.. ఆ మహిళ కడుపులో రూ.9.73 కోట్ల డ్రగ్స్ క్యాప్సుల్స్‌.!

|

Sep 30, 2024 | 8:38 AM

స్మగ్లర్స్‌ రోజు రోజుకూ కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. డ్రగ్స్‌, బంగారం, గంజాయి కొంగొత్త మార్గాల్లో అక్రమ రవాణా చేస్తున్నారు. ఎన్ని ఎత్తులు వేసినా కేటుగాళ్ల గుట్టు ఏదో ఒక రూపంలో బయటపడుతూనే ఉంది. అలాంటి ఎన్నో ఘటనలను మనం చూశాం. తాజాగా ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో కొకైన్ సరఫరా చేస్తున్న బ్రెజిల్ మహిళను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్టు చేశారు.

స్మగ్లర్స్‌ రోజు రోజుకూ కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. డ్రగ్స్‌, బంగారం, గంజాయి కొంగొత్త మార్గాల్లో అక్రమ రవాణా చేస్తున్నారు. ఎన్ని ఎత్తులు వేసినా కేటుగాళ్ల గుట్టు ఏదో ఒక రూపంలో బయటపడుతూనే ఉంది. అలాంటి ఎన్నో ఘటనలను మనం చూశాం. తాజాగా ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో కొకైన్ సరఫరా చేస్తున్న బ్రెజిల్ మహిళను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్టు చేశారు. డ్రగ్స్ అక్రమ రవాణా జరుగుతున్నట్టు సమాచారం అందుకున్నారు ఇంటెలిజెన్స్‌ అధికారులు. క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేశారు. దీంతో ఆ మహిళ శరీరంలో 973 గ్రాముల కొకైన్‌తో కూడిన 124 క్యాప్సూల్స్‌ ఉన్నట్లు గుర్తించారు.

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో కొకైన్ సరఫరా చేస్తున్న బ్రెజిల్ మహిళను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కొకైన్‌గా భావించే పదార్థాన్న, అలాగే నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ పదార్ధాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అంతర్జాతీయ డ్రగ్ సిండికేట్‌లోని ఇతర సభ్యుల జాడ కోసం విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. డ్రగ్స్‌తో సావోపాలో నుంచి ముంబై విమానాశ్రయంలో దిగింది ఆ మహిళ. ఆ సమయంలోనే అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు. డ్రగ్స్‌తో ఫిల్‌ చేసిన క్యాప్సూల్స్‌ను తన శరీరంలోకి తీసుకుని భారత్‌లోకి వచ్చినట్లు నిందితురాలు అంగీకరించిందని అధికారులు పేర్కొన్నారు. ఆమెను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి, ఆ తర్వాత జేజే ఆస్పత్రిలో చేర్చారు. ఆమె 9.73 కోట్ల రూపాయల విలువైన 973 గ్రాముల కొకైన్‌ ఉన్న 124 క్యాప్సూల్స్‌ను మింగేసిందని అధికారి తెలిపారు. తదుపరి విచారణ కొనసాగుతున్నట్టు వివరించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on