Viral: ఆర్టీసీ బస్సునే చోరీ చేసి పారిపోయాడు.. చివరికి అదిరిపోయే ట్విస్ట్.!
మద్యం సేవించిన వారు కొందరు విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తుంటారు. మద్యం మత్తులో వారేం చేస్తుంన్నారో వారికే తెలియదు. తాజాగా ఓ వ్యక్తి ఏకంగా ఆర్టీసీ బస్సును కొట్టేసి పారిపోయే ప్రయత్నం చేశాడు. మధ్యలో యాక్సిడెంట్ కావడంతో పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్ డిపోలో చోరీ కలకలం రేపింది.
మద్యం సేవించిన వారు కొందరు విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తుంటారు. మద్యం మత్తులో వారేం చేస్తుంన్నారో వారికే తెలియదు. తాజాగా ఓ వ్యక్తి ఏకంగా ఆర్టీసీ బస్సును కొట్టేసి పారిపోయే ప్రయత్నం చేశాడు. మధ్యలో యాక్సిడెంట్ కావడంతో పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్ డిపోలో చోరీ కలకలం రేపింది. అర్ధరాత్రి సమయంలో ఆర్టీసీ బస్సు చోరీకి గురికావడం అందరినీ షాక్ అయ్యేలా చేసింది. మహారాష్ట్రకు చెందిన గణేష్ అనే వ్యక్తి మద్యం మత్తులో ఆర్టీసీ డిపో గోడదూకి లోపలికి ప్రవేశించాడు. తాగిన మైకంలో ఆర్టీసీ బస్సును తీసుకెళ్లాడు. అక్కడినుంచి సోఫీ నగర్ వైపు వెళ్తుండగా కంచరోని చెరువు సమీపంలో బస్సు ప్రమాదానికి గురైంది. గమనించిన స్థానికులు వెంటనే ఆర్టీసీ కార్యాలయానికి సమాచారం అందించారు. బస్సు అక్కడే వదిలేసి పారిపోతున్న అతన్ని ఆర్టీసీ సెక్యూరిటీ సిబ్బంది వెంబడించి కడ్తాల్ గ్రామ సమీపంలో బైపాస్ దగ్గర పట్టుకున్నారు. బస్సు చోరీపై అతన్ని పోలీసులు విచారించగా బస్సు ఆగి ఉంటే తీసుకొచ్చానని నిందితుడు చెప్పాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.