Crime: తీర్థం పేరుతో నోటిలో యాసిడ్.. 11మందిని చంపేసిన తాంత్రికుడు..!

|

Dec 16, 2023 | 4:02 PM

ఎట్టకేలకు ఓ నరరూప రాక్షసుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాంత్రిక పూజల పేరుతో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 11మందిని పొట్టనబెట్టుకున్నాడు దుర్మార్గుడు. అత్యంత దారుణమైన ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. మంత్రాలు, మాయలు చేసి గుప్తనిధులను వెలికితీస్తానంటూ అమాయకులను మోసం చేయడం, ఎవరైనా ఎదురు తిరిగితే మట్టుబెట్టడం, ఇలా ఇప్పటివరకు ఏకంగా 11 మందిని పొట్టన పెట్టుకున్న ఆ సీరియల్ కిల్లర్‌.

ఎట్టకేలకు ఓ నరరూప రాక్షసుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాంత్రిక పూజల పేరుతో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 11మందిని పొట్టనబెట్టుకున్నాడు దుర్మార్గుడు. అత్యంత దారుణమైన ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. మంత్రాలు, మాయలు చేసి గుప్తనిధులను వెలికితీస్తానంటూ అమాయకులను మోసం చేయడం, ఎవరైనా ఎదురు తిరిగితే మట్టుబెట్టడం, ఇలా ఇప్పటివరకు ఏకంగా 11 మందిని పొట్టన పెట్టుకున్న ఆ సీరియల్ కిల్లర్‌. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రానికి చెందిన సీరియల్ కిల్లర్ సత్యనారాయణ యాదవ్ అమాయకులైన ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకున్నాడు. తన మంత్రశక్తితో గుప్త నిధులను వెలికితీస్తానని నమ్మబలికాడు.

తనకు పరిచయమైన వారిని నమ్మించి, వారి పేరిట ఉన్న భూములు, ఆస్తిపాస్తులను తన పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటాడు. ఎవరైనా తిరగబడితే గుట్టుచప్పుడు కాకుండా హత్యకు తెగబడతాడు. తీర్థం పేరుతో నోటిలో యాసిడ్ పోసి చంపేవాడు. ఇలాగే ఉద్యోగాలు ఇప్పిస్తానని ఒక వ్యక్తిని చంపగా, ఆ కేసు విచారిస్తుండగా పోలీసులకు ఈ కిల్లర్‌ సత్యం అఘాయిత్యాలు వెలుగులోకి వచ్చాయి.. ఒక హత్య కేసుతో ఈ తాంత్రికుడి డొంక అంతా కదిలింది. ఆ సీరియల్ కిల్లర్‌ని ఎట్టకేలక అరెస్ట్‌ చేశారు పోలీసులు. సత్యనారాయణ ఇప్పటి వరకు 7 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. అతడి నుంచి పాయిజన్ బాటిట్స్‌, బాధితుల ఫోన్లు, 10 సిమ్‌కార్డులు సీజ్‌ చేశారు. 2020 నుంచి వరుస హత్యలకు పాల్పడుతున్నాడు సత్యనారాయణ.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.