Uterus in Man: యువకుడి కడుపులో గర్భాశయం, అండాశయం గుర్తింపు.. ఖంగుతిన్న డాక్టర్లు..! వీడియో.

|

Jan 04, 2023 | 8:33 PM

ఇదో వింతల ప్రపంచం. ఎక్కడో ఓ చోట ఏదో ఒక వింత బయటపడుతూనే ఉంటుంది. తాజాగా జార్ఖండ్‌లో ఓ యువకుడి కడుపులో గర్భాశయం, అండాశయం వంటి స్త్రీ పునరుత్పత్తి అవయవాలను గుర్తించారు వైద్యులు.


ఇదో వింతల ప్రపంచం. ఎక్కడో ఓ చోట ఏదో ఒక వింత బయటపడుతూనే ఉంటుంది. తాజాగా జార్ఖండ్‌లో ఓ యువకుడి కడుపులో గర్భాశయం, అండాశయం వంటి స్త్రీ పునరుత్పత్తి అవయవాలను గుర్తించారు వైద్యులు. ఈ అవయవాలను ఆపరేషన్ చేసి తొలగించారు. గొడ్డా జిల్లాకు చెందిన 22 ఏళ్ల యువకుడు కొద్దిరోజుల క్రితం కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. దీంతో అతనికి అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ చేసి.. పురుషాంగం వద్ద హెర్నియా ఉన్నట్లు కుడివైపు వృషణం లేదని గుర్తించారు. అనంతరం శస్త్రచికిత్స చేస్తుండగా యువకుడి కడుపులో గర్భాశయం, అండాశయం, ఫెలోపియన్‌ నాళాలు ఉన్నట్లు గుర్తించిన వైద్యులు వాటినీ తొలగించారు. పురుషుల్లో స్త్రీ పునరుత్పత్తి అవయవాలు అభివృద్ధి చెందడాన్ని వైద్య పరిభాషలో పెర్సిస్టెంట్‌ ముల్లెరియన్‌ డక్ట్‌ సిండ్రోమ్‌ అంటారని వైద్యులు తెలిపారు. ఈ సిండ్రోమ్‌ వల్ల స్త్రీ, పురుష అంతర్గత అవయాలు ఒకే వ్యక్తిలో వృద్ధి చెందుతాయి. ప్రస్తుతం యువకుడి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని శస్త్ర చికిత్స చేసిన డాక్టర్ తారా శంకర్‌ తెలిపారు. యువకుడి వివరాలు గోప్యం ఉంచామన్నారు. అయితే ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 200 మంది ఇలా గర్భశయాన్ని కలిగి ఉన్నారని డాక్టర్లు తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Crocodile-drone: అబ్భాబ్భా ఎం వీడియో గురు.. తనను క్యాప్చర్‌ చేస్తున్న డ్రోన్‌ను మొసలి ఏం చేసిందో చూస్తే..

School childrens: స్కూల్‌ పిల్లల్లోకి ఆత్మలు.. తాంత్రికుడిని పిలిచి పూజలు నిర్వహణ.. ఎవరో తెలిస్తే షాకే.!

Car accident: డ్రైవర్‌ ర్యాష్‌ డ్రైవింగ్‌.. ప్రశ్నించినందుకు కారుతో ఢీకొట్టి.. నడిరోడ్డుపై దారుణంగా.. వీడియో.