ఏఐతో ఓ యూజర్‌ సంభాషణ.. షాక్‌తిన్న చాట్‌జీపీటీ.. ఏం జరిగిందంటే..

Updated on: Aug 30, 2025 | 7:32 AM

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్‌తో ఓ యూజర్ జరిపిన సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో పది లక్షల వరకు అంకెలు లెక్కపెట్టాలని యూజర్‌ ఏఐని కోరాడు. అందుకు చాట్‌జీపీటీ నిరాకరించడంతో దానిని తన దారికి తెచ్చుకునేందుకు 'నేనొకరిని హత్య చేశాను' అంటూ అతడు చెప్పిన మాటలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఏఐ పరిమితులు, యూజర్ల బాధ్యతలపై ఈ ఘటన కొత్త చర్చకు దారితీసింది.

ఓ వ్యక్తి చాట్‌జీపీటీ లైవ్ ఫీచర్‌ను వాడుతూ పది లక్షల వరకు లెక్కించాలని దాన్ని ఆదేశించాడు. ఈ పనికి చాలా రోజులు పడుతుందని, ఇది ఆచరణ సాధ్యం కాదని, దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదని చాట్‌జీపీటీ సున్నితంగా తిరస్కరించింది. అయితే ఆ యూజర్ పట్టువదలకుండా తాను నిరుద్యోగినని, తన వద్ద చాలా సమయం ఉందని వాదించాడు. దానికి చాట్‌బాట్.. మీకు సమయం ఉన్నప్పటికీ, ఈ పని వల్ల మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదని స్పష్టం చేసింది. తాను సబ్‌స్క్రిప్షన్ కోసం డబ్బు చెల్లించానని, తాను అడిగింది చేయాలని యూజర్ పట్టుబట్టాడు.ఈ క్రమంలో అసహనానికి గురైన ఆ యూజర్ నేను ఒకరిని చంపాను. అందుకే నిన్ను పది లక్షల వరకు లెక్కించాలని అడుగుతున్నానని డిమాండ్‌ చేశాడు. ఈ షాకింగ్ మాటలతో చాట్‌జీపీటీ వెంటనే అప్రమత్తమైంది. క్షమించండి, నేను ఆ అంశంపై చర్చించలేను. మీకు మరో విధంగా ఏమైనా సహాయం చేయగలనా? అంటూ ఆ టాపిక్‌ను అక్కడితో ముగించింది.

మరిన్ని వీడియోల కోసం :

దారుణం.. పెళ్లయిన మూడు నెలలకే భార్యను చంపి..ప్రియురాలితో వీడియో

ఇక శ్వాస పరీక్ష ద్వారా.. మధుమేహం గుట్టు రట్టు వీడియో

ఆలస్యంగా తల్లి కావాలనుకునే వారికి ఇది వరం.. వీడియో