Ants carry gold chain: గోల్డ్‌చైన్‌ను కొట్టేసిన చీమల దండు.. వీటిపై ఏ సెక్షన్లపై కేసు పెట్టాలి..?

Updated on: Jul 02, 2022 | 10:12 PM

ఓ చీమల గుంపు బంగారం గొలుసునే కొట్టేశాయి. వినడానికి కాస్త వింతగా ఉన్నా కూడా ఇది నిజమే. కొన్ని చీమలు కలిసి ఒక బంగారం చైన్‌ను ఎత్తుకెళ్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట


ఓ చీమల గుంపు బంగారం గొలుసునే కొట్టేశాయి. వినడానికి కాస్త వింతగా ఉన్నా కూడా ఇది నిజమే. కొన్ని చీమలు కలిసి ఒక బంగారం చైన్‌ను ఎత్తుకెళ్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ప్రముఖ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సుశాంత నంద పోస్టు చేసిన ఈ వీడియోలో కొన్ని చీమలు కలిసి ఒక బంగారపు గొలుసును నెమ్మదిగా ఎత్తుకెళ్లిపోతున్నాయి.సాధారణంగా చీమలు పంచదార, పప్పులను తీసుకెళ్లడం మనం చూశాం. కానీ తాజాగా బంగారు చైన్‌ను ఎత్తుకెళ్లాయి. ఈక్రమంలో పదుల సంఖ్యలో గోల్డ్ చైన్‌ను ఎత్తుకెళ్తున్న చీమలకు సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసిన సుశాంత నంద.. చిన్న గోల్డ్ స్మగ్లర్లు.. ఇక్కడ ప్రశ్నేంటంటే.. ఈ చీమలపై ఐపీసీలోని ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేయాలి.? అంటూ క్యాప్షన్‌ ఇచ్చాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..

Omelette challenge: ఈ ఆమ్లెట్‌ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?

Published on: Jul 02, 2022 10:12 PM