Uttar Pradesh: ఒక్కసారిగా విరిగిపడిన కొండచరియలు.. ప్రయాణికులు పరుగులు.. షాకింగ్‌ దృశ్యాలు..(వీడియో)

|

Sep 29, 2022 | 9:41 PM

భారీ వర్షాలు, వరదల కారణంగా పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. ఈక్రమంలో ఉత్తర్‌ప్రదేశ్‌, ప్రయాగ్‌రాజ్‌లోని తర్సాలి గ్రామ సమీపంలో


భారీ వర్షాలు, వరదల కారణంగా పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. ఈక్రమంలో ఉత్తర్‌ప్రదేశ్‌, ప్రయాగ్‌రాజ్‌లోని తర్సాలి గ్రామ సమీపంలో ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. దాంతో జాతీయ రహదారి 109 పూర్తిగా మూసుకుపోయింది. రెండు వైపుల కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈ ప్రాంతలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని స్థానికులు ముందే హెచ్చరించటంతో పెను ప్రమాదం తప్పింది. కొండచరియలు విరిగిపడుతున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.నేషనల్‌ హైవేపై పడిన శిథిలాలను తొలగించి వాహన రాకపోకలను త్వరలోనే అనుమతిస్తామని జిల్లా కలెక్టర్‌ మయూర్‌ దీక్షిత్‌ తెలిపారు. ‘ప్రయాణికులు సురక్షిత ప్రాంతాల్లోనే ఉన్నారని, శిథిలాలు తొలగించిన వెంటనే హైవేపై వాహనాలను అనుమతిస్తామని చెప్పారు. మరోవైపు.. కేదార్‌నాథ్‌ వెళ్లే భక్తులు.. సమీప ప్రాంతాల్లోనే ఆగిపోవాల్సి వచ్చింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్‍లోనే..

Pizza: మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..

Published on: Sep 29, 2022 09:41 PM