Students fight: కారు గుద్దినా తగ్గని యువకులు.. లేచి లేచి తన్నుకున్న వైనం.. ఒక్కసారిగా పరార్..

Students fight: కారు గుద్దినా తగ్గని యువకులు.. లేచి లేచి తన్నుకున్న వైనం.. ఒక్కసారిగా పరార్..

Anil kumar poka

|

Updated on: Sep 29, 2022 | 9:45 PM

ఉత్తరప్రదేశ్‌ గాజియాబాద్‌లోని నడిరోడ‍్డు మీద కొందరు విద్యార్థులు గొడవపడుతున్నారు. ఇంతలో వేగంగా వస్తున్న కారు ఆ యువకుల్లో ఇద్దరిని ఢీకొట్టింది. ఓ వ్యక్తి గాల్లో లేచి కారు బానెట్‌మీదుగా కింద పడ్డాడు.


ఉత్తరప్రదేశ్‌ గాజియాబాద్‌లోని నడిరోడ‍్డు మీద కొందరు విద్యార్థులు గొడవపడుతున్నారు. ఇంతలో వేగంగా వస్తున్న కారు ఆ యువకుల్లో ఇద్దరిని ఢీకొట్టింది. ఓ వ్యక్తి గాల్లో లేచి కారు బానెట్‌మీదుగా కింద పడ్డాడు. అయినా ఫైటింగ్‌ ఆపలేదు.. కింద పడ్డ యువకుడు పైకి లేచి వెళ్లి మళ్లీ గొడవను కంటిన్యూ చేశారు. గొడవ మరింత ఎక్కువైంది. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఇది చూసి స్థానికులు భయపడిపోయారు. కొందరు ధైర్యం చేసి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. గొడవను కంట్రోల్ చేయబోతే వారిని సైతం భయబ్రాంతులకు గురి చేశారు. దాంతో బెదిరిపోయిన స్థానికులు వెనక్కి వచ్చేశారు. యువకుల ఘర్షణ గురించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. మరోవైపు పోలీసుల రాకను గమనించిన యువకులు.. అక్కడి నుంచి పరారయ్యారు. అయితే, కొందరు విద్యార్థులు మాత్రం పోలీసులకు చిక్కారు. దొరికిన వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.ఇక విద్యార్థులకు భీకర ఘర్షణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ రేంజ్‌లో జరిగిన ఈ ఫైటింగ్‌ను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్‍లోనే..

Pizza: మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..

Published on: Sep 29, 2022 09:45 PM