Student – Teacher: వీడు ఖతర్నాక్‌ స్టూడెంట్‌.. ఎగ్జామ్‌లో టీచర్‌కు చుక్కలు చూపించాడు.!

|

Sep 24, 2024 | 9:31 PM

బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ అనగానే సహజంగానే వాళ్లు కిలాడీలు అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ.. పెద్దయ్యాక వీళ్లే ఎక్కువగా సక్సెస్ అవుతుంటారు. వివిధ రంగాల్లో అసమాన్య ప్రతిభ కనబరుస్తూ ఉంటారు. అయితే బ్యాక్ బెంచ్‌లో కూర్చునే అందరూ చదవరు అనుకోడానికి లేదు. వాళ్లలో కొందరు చాలా క్రియేటివ్‌గా ఆలోచిస్తారు. జస్ట్‌, ఎగ్జామ్స్‌కి ముందు రోజు బుక్స్ పట్టి కూడా క్లాస్ టాపర్‌గా నిలుస్తారు.

బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ అనగానే సహజంగానే వాళ్లు కిలాడీలు అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ.. పెద్దయ్యాక వీళ్లే ఎక్కువగా సక్సెస్ అవుతుంటారు. వివిధ రంగాల్లో అసమాన్య ప్రతిభ కనబరుస్తూ ఉంటారు. అయితే బ్యాక్ బెంచ్‌లో కూర్చునే అందరూ చదవరు అనుకోడానికి లేదు. వాళ్లలో కొందరు చాలా క్రియేటివ్‌గా ఆలోచిస్తారు. జస్ట్‌, ఎగ్జామ్స్‌కి ముందు రోజు బుక్స్ పట్టి కూడా క్లాస్ టాపర్‌గా నిలుస్తారు. అలానే.. కొందరు స్కూల్ లేదా కాలేజ్‌లో ఎగ్జామ్స్ పెట్టినప్పుడు.. ఆన్సర్స్ తెలియక తమకు తోచింది రాస్తుంటారు. కొందరు అయితే మరీ నవ్వు తెప్పించేలా ఆన్సర్స్ రాస్తూ టీచర్స్‌కు అడ్డంగా దొరికిపోతూ ఉంటారు. ఆ ఘటనలు గుర్తుకువస్తే ఇప్పుడు ఫన్నీ అనిపిస్తూ ఉంటుంది. అప్పటి రోజులు గుర్తుకు వచ్చి కొంత ఎమోషన్‌కు కూడా లోనవుతూ ఉంటాం.

తాజాగా ఓ ఇస్మార్ట్ స్టూడెంట్ ఇంగ్లీషులో రాసిన ఆన్సర్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. దీనిపై రకరకాల మీమ్స్ కూడా వస్తున్నాయి. ఆ ఎగ్జామ్‌ పేపర్‌లో కొన్ని పదాలు ఇచ్చి.. వాటితో వాక్యాలు రాయమన్నారు. అందులో మొదటి పదం టీచర్‌.. దీనికి ఆ స్టూడెంట్‌ ఆన్సర్‌ మై టీచర్‌ ఈజ్‌ క్రిమినల్‌ అని ఆన్సర్‌ రాసాడు. రెండో పదం పోలీస్‌-దీనికి సమాధానంగా ఆ విద్యార్ధి పోలీస్‌.. ప్లీజ్‌ అరెస్ట్‌ హిమ్‌ అని రాసాడు. ఇక మూడో పదం పైలట్‌.. పైలట్‌, ప్లీజ్‌ ల్యాండ్‌ ప్లెయిన్‌ ఆన్‌ మై టీచర్‌ అని రాశాడు. నాలుగో పదం డాక్టర్‌-దీనికి ఆన్సర్‌గా డాక్టర్‌..ప్లీజ్‌ గివ్‌ పాయిజన్‌ ఇంజక్షన్‌ టు మై టీచర్‌ అంటూ ఇంగ్లీషులో సమాధానాలు రాశాడు ఆ కిర్రాక్ స్టూడెంట్. అతను రాసిన వాక్యాల్లో.. ఎక్కడా తప్పు లేదు. అన్నీ కరెక్ట్‌గా రాశాడు. పనిలో పనిగా ఆ టీచర్‌పై తనకున్న కోపాన్నంతా వెళ్లగక్కాడు. ఇది చూసిన నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు. ఒరేయ్.. ఆ టీచర్‌ని చంపేవరకు నువ్వు నిద్రపోయేలా లేవుగా అని ఓ యూజర్ కామెంట్ పెట్టాడు. నువ్వు ఇప్పుడే ఇలా ఉన్నావంటే.. పెద్దయ్యాక నిన్ను ఊహించడమే కష్టమే అని మరో నెటిజన్ వ్యాఖ్యానించాడు.

 

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.