Strange Custom: ముళ్లున్న ఉయ్యాలలో ఊగితే రోగాలు రావా..? పాడేరు మన్యంలో వింత ఆచారం.

|

Nov 30, 2023 | 5:30 PM

ఇప్పటి వరకూ మీరు రకరకాల ఉత్సవాల గురించి విని ఉంటారు. చూసి ఉంటారు కూడా.. అయితే ముళ్ల ఊయల ఉత్సవం గురించి ఎప్పుడైనా విన్నారా? మన దేశంలో వివిధ ప్రాంతాల్లో వివిధ ఆచార సంప్రదాయాలు ఆచరిస్తారు. ఇక గిరిజనుల సంప్రదాయాలగురించి చెప్పనక్కర్లేదు. వారి ఆచారాలు కాస్త భిన్నంగా ఉంటాయి. ఆచారం, సంప్రదాయం ఏదైనా.. అందరి ఉద్దేశం దైవాన్ని ఆరాధించడమే. ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరిజిల్లా పాడేరులోని గిరిజనులు కార్తీక పౌర్ణమి సందర్భంగా..

ఇప్పటి వరకూ మీరు రకరకాల ఉత్సవాల గురించి విని ఉంటారు. చూసి ఉంటారు కూడా.. అయితే ముళ్ల ఊయల ఉత్సవం గురించి ఎప్పుడైనా విన్నారా? మన దేశంలో వివిధ ప్రాంతాల్లో వివిధ ఆచార సంప్రదాయాలు ఆచరిస్తారు. ఇక గిరిజనుల సంప్రదాయాలగురించి చెప్పనక్కర్లేదు. వారి ఆచారాలు కాస్త భిన్నంగా ఉంటాయి. ఆచారం, సంప్రదాయం ఏదైనా.. అందరి ఉద్దేశం దైవాన్ని ఆరాధించడమే. ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరిజిల్లా పాడేరులోని గిరిజనులు కార్తీక పౌర్ణమి సందర్భంగా వింత సంప్రదాయాన్ని ఆచరిస్తారు. స్థానికులు ఆరోజు శివాలయం వద్ద పెద్ద పెద్ద ముళ్లుతో ఉన్న ఊయలను ఏర్పఏర్పాటుచేసి ఊయల ఊగుతారు. దీనినే ముళ్ల ఊయల ఉత్సవం అంటారు. కార్తీక పౌర్ణమి రోజు ముళ్ల ఊయల ఊగితో గ్రామానికి ఎలాంటి కీడు సోకదని, అనారోగ్య సమస్యలు రావని నమ్ముతారు. జిల్లాలోని పాడేరు మండలం చింతలవెల్లి గ్రామంలో ఈ వింత ఆచారాన్ని పాటిస్తారు. కార్తీక పౌర్ణమిరోజు గ్రామస్తులంతా స్థానిక శివాలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహింస్తారు. ఈ క్రమంలో కొందరు మహిళలపై అమ్మవారు పూనుతారని వారినమ్మకం. ఆ మహిళలను అమ్మవారిగా భావించి శాంతి పూజలు చేస్తారు. అనంతరం ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన ముళ్ల ఊయల ఎక్కి ఊగుతారు. ముళ్లు గుచ్చుకోకుండా తమను అమ్మవారే రక్షిస్తుందని వారు ప్రగాఢంగా నమ్ముతారు. అనంతరం గ్రామచావిడిలో ఏర్పాటుచేసిన నిప్పుల గుండంపై నడుస్తారు. అనంతరం గ్రామ పూజారి గాసన్న త్రిమూర్తుల పూజను నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో గ్రామస్తులంతా పెద్దసంఖ్యలో పాల్గొంటారు. భక్తితో జాతరను నిర్వహించి, అందరూ కలిసి సహపంక్తి భోజనం ఆరగిస్తారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.