Snake Rabbit fight : పాముకు చుక్కలు చూపించిన కుందేలు..! పామును ఎదురించి కొరికి మరీ..

|

Sep 11, 2022 | 9:27 AM

ఈ మధ్య సోషల్ మీడియాలో జంతువుల వీడియోలు తెగ హల్‌చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా జంతువులు తమ ఆహారాన్ని వేటాడే వీడియోలు నిత్యం మనం చూస్తూ ఉంటాం.. ఈ వీడియో కూడా అలాంటిదే..


ఈ మధ్య సోషల్ మీడియాలో జంతువుల వీడియోలు తెగ హల్‌చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా జంతువులు తమ ఆహారాన్ని వేటాడే వీడియోలు నిత్యం మనం చూస్తూ ఉంటాం.. ఈ వీడియో కూడా అలాంటిదే.. తమ ప్రాణాలమీదకు వస్తే ఎంత చిన్న జంతువైనా ఎదురు తిరిగి పోరాడుతుందనడానికి ఉదాహరణ. సర్పాలను చూస్తేనే మనం వణికిపోతాం.. అలాంటి పాము ఒక్కసారిగా దాడికి దిగితే.. చిన్న ప్రాణులను ఇట్టే మట్టుపెట్టి తినేస్తాయి. ఈ వీడియోలో పాము కూడా అదే చేయబోయింది. ఓ కుందేలుపై దాడి చేయాలని చూసింది. కానీ ఆ పాముకు ఊహించని షాక్ ఇచ్చింది కుందేలు. ఓ పార్క్ గడ్డిలో ఉన్న ఓ కుందేలు పై ఒక్కసారిగా దాడి చేసింది పాము. ఆ కుందేలును కాటేసి, ఆతర్వాత చుట్టేసి మింగేయాలని ప్రయతించింది. కానీ, కుందేలు ఏమాత్రం భయపడకుండా ఆ పాముతో పోరాడింది. పాముకు ఎక్కడ అవకాశం ఇవ్వకుండా దానిపై ఎదురుదాడికి దిగింది. చివరకు కుందేలును విడిచి పాము వెళ్లిపోతున్నా ఆ కుందేలు మాత్రం దాన్ని వెంబడించి మరీ తరిమింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ, ఇప్పుడు ఈవీడియో సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Bride Running on Road: నీ తల్లీ అంటూ మరోసారి తెలంగాణ శకుంతలను గుర్తు చేసిన మహిళా.. నన్ను పెళ్లి చేసుకుంటావా..లేదా..!

Mother sentiment: పసితనంలో తల్లిని పోగొట్టుకొని.. ఆమె తల్లి సమాధి వద్ద ఈ పిల్లాడు చేసిన పనికి మీకు కూడా కనీళ్లు ఆగవు..

Published on: Sep 11, 2022 09:27 AM