Heart Touching: పేదవాడి పెద్ద మనసు.. హ్యాట్సాఫ్ పెద్దాయనా..! వీడియో అదుర్స్..
కొంతమంది ధనానికి పేదవారైనా, మంచితనం, మానవత్వంలో వారికి మించిన ధనవంతులు ఉండరు. మంచి మనసే వారి ఆస్తి, మంచి మనసు ముందు డబ్బు కూడా ఓడిపోతుంది.
కొంతమంది ధనానికి పేదవారైనా, మంచితనం, మానవత్వంలో వారికి మించిన ధనవంతులు ఉండరు. మంచి మనసే వారి ఆస్తి, మంచి మనసు ముందు డబ్బు కూడా ఓడిపోతుంది. ఓ పెద్దాయన చేసిన పని నెటిజన్లను కదిలిస్తుంది. ఈ వీడియో చూసిన వారి మనసులు ఆయన పట్ల ఎంతో గౌరవ భావంతో స్పందిస్తున్నాయి. అసలు విషయం ఏంటంటే.. రోడ్డు పక్కన ఓ పెద్దాయన భేల్ పూరి అమ్ముకుంటున్నాడు. ఆయన దగ్గరకు రెండు చేతులు లేని ఓ దివ్యాంగ కుర్రాడు వచ్చాడు. భేల్ పూరి ఇవ్వమని అడిగాడు. ఆ అబ్బాయి కోసం ఆ పెద్దాయన భేల్ పూరి తయారుచేసి పొట్లం కట్టి ఆ అబ్బాయికి జాగ్రత్తగా ఇచ్చాడు. అందుకు ఆ యువకుడు అతనికి డబ్బులు ఇచ్చాడు. అయితే ఆ యువకుడి పరిస్థితిని చూసి మనసు చలించిపోయిన ఆ పెద్దాయన ఆ డబ్బును తిరిగి ఆ కుర్రాడికి ఇచ్చేశాడు. అంతేకాదు, సంతోషంగా ఉండు అంటూ ఆ యువకుడికి రెండుచేతులతో నమస్కరించి ఆశీస్సులిచ్చాడు. ఈ వీడియోను డా.వికాస్ కుమార్ అనే యూజర్ ట్విట్టర్లో షేర్ చేశారు. వీడియో చూసిన నెటిజన్లు చాలా ఎమోషన్ గా రియాక్డ్ అవుతున్నారు. డబ్బు ఉన్నవాడు కాదు గొప్పవాడు, మంచి మనసున్నవాడే నిజమైన ధనవంతుడు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rana: నీనవ్వు నన్ను మళ్ళీ నీ ప్రేమలో పడేలా చేస్తుంది.. రానా భార్య.
Fact Video: లేడీస్ బి అలెర్ట్..! పొంచి ఉన్న ప్రమాదం.. విషపూరితమైన మేకప్ గురించి విన్నారా..?
Taraka Ratna: తారకరత్నని చూడటానికి వచ్చిన మతిస్థిమితం లేని వ్యక్తి.. బాలయ్యకు ఏదో చెప్తూ..